New Electric Vehicle Policy : పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించే దిశగా అత్యంత కీలకమైన అడుగు వేస్తూ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం సమగ్ర ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానానికి (comprehensive Electric Vehicle (EV) policy ) పచ్చ జెండా ఊపింది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బీహార్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్.. రాష్ట్రాన్ని మరింత పర్యావరణ అనుకూల రవాణా వైపు నడిపించేందుకు రాబోయే ఐదేళ్లలో ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకుంది. బీహార్‌లో 2028 నాటికి కొత్త వాహనాల్లో 15% ఎలక్ట్రిక్ వాహనాలుగా (EVలు) నమోదు చేయడమే లక్ష్యంగా నిర్ణయించింది.
ఎలక్ట్రిక్ మొబిలిటీని బలోపేతం చేయడానికి ఏకకాలంలో PM-eBus సేవా పథకం కింద 400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి రవాణా శాఖ నుండి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బస్సులు బీహార్‌లోని వివిధ జిల్లాల్లో పరుగులు పెట్టనున్నాయి. సంప్రదాయ పెట్రోల్, డీజిల్‌తో నడిచే ప్రజా రవాణా వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నారు.
బీహార్ తీసుకున్న ఈ చర్య గురించి పరిశీలిస్తే..
[table id=12 /]
ముఖ్యమంత్రి చొరవ
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను అవగాహన కోసం గత నాలుగు సంవత్సరాలుగా పాట్నాలో తన ప్రయాణాలకు ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు.
EV పాలసీ లక్ష్యాలపై రవాణా శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. “బీహార్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ పాలసీ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం మరియు దాని అనుబంధ పరిశ్రమలలో స్టార్టప్‌లు, పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటాం.
ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
పవర్ ఛార్జింగ్ స్టేషన్‌లకు విద్యుత్‌ను మరింత సరసమైనదిగా చేయడానికి, పాలసీ మొదటి మూడేళ్లలో పబ్లిక్, సెమీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లకు పవర్ టారిఫ్‌లపై 30% సబ్సిడీని మంజూరు చేస్తుంది. ఈ రాయితీ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల సెటప్‌కు కూడా విస్తరించింది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నాయని అగర్వాల్ వివరించారు.
EV ఛార్జింగ్ స్టేషన్‌ల కోసం సోలార్ పవర్ ను ఉపయోగించడాన్ని ఈ పాలసీ మరింత ప్రోత్సహిస్తుంది, 2023-24 ఆర్థిక సంవత్సరంలో హైపర్ టెన్షన్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల కోసం టారిఫ్ రేట్లను ₹8/KvA కి సెట్ చేస్తుంది.
ముగింపు
EV పాలసీ కింద 400 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చేయడం బీహార్ లో చక్కని ఆలోచన. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు బీహార్ అడుగులు వేస్తుండడం శుభ పరిణామం. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడంపై దృష్టి సారించడంతో ఈ కార్యక్రమాలు బీహార్ యొక్క రవాణా ల్యాండ్‌స్కేప్‌ను మార్చగలవనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.