
Ola Electric : బెంగళూరు, డిసెంబర్ 19, 2024: భారతదేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన #SavingsWalaScooter ప్రచారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇది ప్రతి భారతీయ ఇంటికి EVలను మరింత చేరువ చేయడానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. Ola Electric తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 25న 4000 కి విస్తరించనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా EV పంపిణీ వేగవంతమైన రోల్ అవుట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది.
3200+ కొత్త స్టోర్‌లతో దాని ప్రస్తుత పాదముద్రను పూర్తి చేయడంతో, ఓలా ఎలక్ట్రిక్ మెట్రో నగరాలు, టైర్-2, టైర్-3 పట్టణాల్లోని వినియోగదారులకు సరసమైన, అధిక-నాణ్యత EV ల పోర్ట్‌ఫోలియోను తీసుకువస్తోంది. సర్వీస్ సెంటర్లతో కలిసి ఉన్న ఈ స్టోర్‌లు, కస్టమర్‌లు బెస్ట క్లాస్ విక్రయాలు, అమ్మకాల తర్వాత మద్దతు అందేలా చూస్తాయి, బిలియన్ భారతీయులకు Savings Wala Scooter విప్లవాన్ని బలోపేతం చేస్తాయని కంపెనీ విశ్వసిస్తోంది. Savings Wala Scooter ప్రచారం ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచడానికి, ICE వాహనాలకు దూరంగా భారతదేశాన్ని గ్రీన్ మొబిలిటీ వైపు మార్చడానికి ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.తన పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ICE వాహనాల మేయింటెనెన్స్ ధరల నుండి ఉపశమనం అందిస్తుంది.
వినూత్న ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోతో Ola Electric నెట్‌వర్క్ ను వేగంగా విస్తరిస్తోంది. ఇటీవలే ఓలా Gig మరియు S1 Z స్కూటర్ శ్రేణులను ప్రారంభించిన విషయం తెలిసిందే.. , ఇవి వ్యక్తిగత, వాణిజ్య అవసరాలకు మన్నికైన, నమ్మదగిన సౌకర్యవంతమైన పరిష్కారాలను అందిస్తాయి. కొత్త స్కూటర్ల ధరలు ₹39,999 నుంచి ప్రారంభమవుతాయి. గ్రామీణ, సెమీ-అర్బన్, పట్టణ మార్కెట్‌ల కోసం రూపొందించబడిన స్కూటర్లు గతంలో కంటే మరింత మన్నకగా ఉంటాయి. అదనంగా, Ola S1 పోర్ట్‌ఫోలియో, రాబోయే రోడ్‌స్టర్ సిరీస్ విభిన్నమైన శ్రేణి కస్టమర్‌ల అభిరుచులకు అనుగుణంగా ఉండనున్నాయి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..