New Solar power Plants in Telangana : రాష్ట్రంలో పాడుబడిన వ్యవసాయ భూములు, సాగులో లేని భూములలో రైతులకు అదనపు ఆదాయం అందించేందుకు త్వరలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్-A పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (PM- Kusum) కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
రైతులకు అదనపు ఆదాయం
ఈ పథకం కింద ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములలో 0.5 మెగావాట్ల నుంచి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోలార్ ప్లాంట్లతో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అలాగే రైతులకు కూడా అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు.
రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చని తెలిపారు. భూమి యజమానికి డెవలపర్లకు మధ్య డిస్కమ్ ల ద్వారా ఒప్పందం మేరకు లీజు మొత్తం అందించబడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు (FPO), వాటర్ యూజర్ అసోసియేషన్లు (WUA) సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తులు TGREDCO ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాar. లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్ ను ఎంపిక చేసుకొని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. డిస్కం ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును రూ. 3.13/కిలో వాట్ గంట(KWH) ధర వద్ద 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..