Home » మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

Spread the love

గంట‌కు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది.

Oben Rorr ఎలక్ట్రిక్ బైక్ ఫీచ‌ర్లు

ప్ర‌చార చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఒబెన్ రోర్ ఆక‌ర్ష‌ణీయ‌మై డిజైన్‌తో స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు భాగంలో LED DRLలతో కూడిన స‌ర్కిల్ ఆల్-LED హెడ్‌ల్యాంప్‌ను క‌లిగి ఉంది. ఇది LED టర్న్ ఇండికేటర్‌లు, ట్రిపుల్-టోన్ కలర్ షేడ్ అత్యద్భుతంగా క‌నిపిస్తోంది. LED టెయిల్‌లాంప్‌ను కూడా కలిగి ఉంది. Oben EV గురించి కంపెనీ చాలా వివరాలను ఇప్ప‌టివర‌కు వెల్లడించలేదు. అయితే, ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 100 kmph వేగాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇది కేవలం 3 సెకన్లలో 0-40 kmph వేగంతో దూసుకుపోగలదని కంపెనీ పేర్కొంది. Oben Rorr EV అనువైన పరిస్థితుల్లో ఒకే ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు నడుస్తుందని తెలిపింది. దాని బ్యాటరీ ప్యాక్‌ను పూర్తిగా చార్జ్ చేయడానికి కేవ‌లం 2 గంటల సమయం పడుతుంది. తమ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేశామని, దీనిని స్థానికంగానే తయారు చేస్తామని కంపెనీ తెలిపింది.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ధర

కొత్త ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. ఇది రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల మ‌ధ్య‌లో ఉంటుంద‌ని అంచనా. Oben EV మార్చి 15, 2022న భారతదేశంలో ప్రారంభించబడుతుంది, అయితే కస్టమర్ డెలివరీలు ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని తెలిపింది. రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త ప్రోడ‌క్ట్‌ను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *