గంటకు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్
తెలంగాణలో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధరకు లభ్యం
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ electric bike ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ.999 బుకింగ్ మొత్తంతో ఒబెన్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభంమవుతాయి.
ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా ఇండియాలోనే డిజైన్/ అభివృద్ధి చేయబడిందని కంపెనీ పేర్కొంది. Oben Rorr electric bike మొదట్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ జైపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.
Oben Rorr electric bike డిజైన్
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్- డిజైన్‌ను కలిగి ఉంది. LED DRL, LED ఇండికేటర్లతో కూడిన వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, ఛార్జింగ్ పోర్ట్ కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. స్ప్లిట్ సీట్లు, LED టైల్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే 230 మిమీ వాటర్ వాడింగ్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది భారతీయ రోడ్లకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
ఒబెన్ రోర్ ఫీచర్లు
ఒబెన్ ఎలక్ట్రిక్ లో 6.5-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. ఈ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్లో వేగం, బ్యాటరీ పర్సంటేజ్, రేంజ్ ఇతర సమాచారం ఉంటుంది. ఎలక్ట్రిక్ బైక్ జియో-ఫెన్సింగ్, జియో-ట్యాగింగ్, బ్యాటరీ థెఫ్ట్ ప్రొటెక్షన్. అలాగే ఛార్జింగ్ స్టేషన్ లొకేటర్ వంటి సమాచారం అందిస్తుంది.
ఒబెన్ రోర్: బ్యాటరీ
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ లో 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 10 kW ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది 62 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ కేవలం 3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు100 kmph గరిష్ట వేగతో దూసుకుపోతుందని కంపెనీ పేర్కొంది.
ఎలక్ట్రిక్ బైక్ పనితీరు / పరిధిని ఆప్టిమైజ్ చేయడానికి ఎకో, సిటీ తోపాటు హావోక్ అనే 3 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.
ఓబెన్ ఎలక్ట్రిక్ క్లెయిమ్ ప్రకారం, ఎలక్ట్రిక్ బైక్ ఒక ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది, అయితే దాని బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటలు పడుతుంది.
దేశంలోని 12,000 పైగా EV ఛార్జింగ్ పాయింట్ల వద్ద తమ వినియోగదారులకు యాక్సెస్‌ను అందించడానికి అనేక భాగస్వాములతో ఓబెన్ ఎలక్ట్రిక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో పాటు 1,000కు పైగా ఒబెన్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఒబెన్ రోర్ వారంటీ
వారంటీ ఓబెన్ రోర్ యొక్క బ్యాటరీ మరియు మోటారుపై 3 సంవత్సరాలు/60,000 కిమీల ప్రామాణిక వారంటీని అందిస్తుంది. అయితే, కస్టమర్‌లు అదనంగా 2 సంవత్సరాల వారంటీని కూడా ఎంచుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Tork Kratos, Revolt RV 400, Pure Ev ఈక్రిస్ట్ వంటి ఎలక్ట్రిక్ బైక్ లకు ఓబెన్ రోర్ పోటీ పడనుంది.
I need distributorship for jaipur Rajasthan