Oben Rorr EZ

Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్

Spread the love

Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి..

  • 2.6 kWh,
  • 3.4 kWh
  • 4.4 kWh.

Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఆసక్తి గల కస్టమర్‌లు వెంటనే రూ.2,999 బుకింగ్ రుసుముతో Rorr EZని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒబెన్ ఎలక్ట్రిక్ స్టోర్‌లలో టెస్ట్ రైడ్‌లు త్వరిత డెలివరీలను పొందవచ్చు.

Oben Rorr EZ డిజైన్, పర్ఫార్మెన్స్..

సంప్రదాయ పెట్రోల్ బైక్ లలో ఉండే క్లచ్ హ్యాండ్లింగ్, వైబ్రేషన్‌లు, అధిక నిర్వహణ ఖర్చులు వంటి ఇబ్బందులు Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ లో ఉండవు. ఇది ఇది LED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. ఇది రైడర్ కు అవసరమైన డయాగ్నోస్టిక్‌లను అందిస్తుంది.

ఈ మోటారుసైకిల్ లో అధిక-పనితీరు గల LFP బ్యాటరీని వినియోగించారు. ఇది మిగతా బ్యాటరీల కంటే మన్నిక, విశ్వసనీయత ఎక్కువ. ముఖ్యంగా భారతదేశంలోని విభిన్న వాతావరణాలలో. ఈ సాంకేతికత 50% ఎక్కువ ఉష్ణోగ్రత నిరోధకతను అందిస్తుంది. సాధారణ బ్యాటరీల జీవితకాలం కంటే రెండింతలు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు భద్రతను అందిస్తుంది.

Oben Rorr EZ ఈవీ గరిష్టంగా 95 km/h వేగాన్ని అందుకుంటుంది. 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 km/h వరకు వేగాన్ని అందుకుంటుంది. 52 Nm టార్క్‌ ను జనరేట్ చేస్తుంది. ఇది నగర ప్రయాణానికి అనువైనదని కంపెనీ చెబుతోంది. పూర్తి ఛార్జ్‌పై, Rorr EZ 175 కిమీ (IDC) రేంజ్ ఇస్తుందని వెల్లడించింది. 45 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. Rorr EZ మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి.. – ఎకో, సిటీ మరియు హవోక్. ఇక ఇందులో ఫీచర్స్ విషయానికొస్రతే UBA, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, DAS వంటివి ఉన్నాయి.

ఇది నాలుగు విలక్షణమైన రంగులలో అందుబాటులో ఉంది. అవి –

  • ఎలక్ట్రో అంబర్
  • సర్జ్ సియాన్
  • లూమినా గ్రీన్
  • ఫోటాన్ వైట్

ఓబెన్ ఎలక్ట్రిక్ ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. రైడర్‌లు నెలకు ₹2,200కి Rorr EZని సొంతం చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇక వారంటీ విషయానికొస్తే 5 సంవత్సరాల వరకు లేదా 75,000 కి.మీ కవరేజీని అందించే వారంటీ ప్యాకేజీలుఅందుబాటు లో ఉన్నాయి. మిగతా వివరాలకు కంపెనీ అధికారిక వెబ్ సైట్ https://obenelectric.com/ ను సందర్శించవచ్చు. రాబోయే నెలల్లో ప్రధాన భారతీయ నగరాల్లో 60 కొత్త షోరూమ్‌లను ప్రారంభించడం ద్వారా రిటైల్ పాదముద్రను విస్తరించే ప్రణాళిక ను కంపెనీ ప్రకటించింది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

More From Author

ZELIO Ebikes

ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ

Green Mobility

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *