ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
X-MEN 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ గతంలో వచ్చిన X-MEN మాదిరిగానే కనిపిస్తుంది. అయితే కొత్త వెర్షన్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ లను కలిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, ఇతర రైడర్‌లతో సహా నగర ప్రయాణికులకు ఇది అనుకూలంగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా 250 డీలర్‌షిప్స్
హర్యానాలోని హిసార్‌లోని లాడ్వాలో ZELIO కంపెనీకి సొంత ఫెసిలిటీ ఉంది. ఇది 72,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. X-MEN 2.0 భారతదేశంలోని విభిన్న రహదారి పరిస్థితులకు అనుగుణంగా అధిక-నాణ్యత ప్రమాణాలతో రూపొందించింది. ZELIO Ebikes 2021లో స్థాపించబడినప్పటి నుండి వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా 256 డీలర్‌షిప్‌లు, 200,000 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు ఉన్నారు.
X-MEN 2.0 భారతదేశంలోని అధీకృత ZELIO డీలర్‌షిప్‌లలో నవంబర్ 12 నుంచి అందుబాటులో ఉంటుంది. మార్చి 2025 నాటికి డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను 400 లకు విస్తరించాలని యోచిస్తోంది. ఇక ZELIO X-MEN ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇందులో 12V/28AH జెల్ బ్యాటరీ లేదా 60V/30A లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. ఈ స్కూటర్ కు 60/72V BLDC మోటారు శక్తినిస్తుంది, ఇది పట్టణ ప్రయాణాలకు అనువైన ఎంపిక.
X-MEN ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్..
X-MEN అనేది తక్కువ విద్యుత్ వినియోగంతో తక్కువ వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్.ఇది ఒక్కో ఛార్జీకి 1.5 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఇది ఒక్కో ఛార్జీకి 60 నుండి 90 కిలోమీటర్ల మైలేజీని ఆశించవచ్చు.
అదనపు ఫీచర్ల విషయానికొస్తే.. ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్, వెనుక కూర్చునే వారి కోసం ఫుట్‌రెస్ట్, కీలెస్ డ్రైవ్ వంట సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం, స్కూటర్ ఫ్రంట్ వీల్‌పై డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. దీని 90-100/10 టైర్లు పట్టు మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..