Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Odysse EV
Spread the love

Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు.

కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడుతూ.. “ SNAP హై-స్పీడ్ స్కూటర్, E2 తక్కువ-స్పీడ్ స్కూటర్ ప్రారంభంతో మేము స్థిరత్వం, కస్టమర్ సంతృప్తి పట్ల న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌లు భారతదేశంలో, వెలుపల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను తీసుకువ‌స్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

Odysse Snap, E2 స్పెసిఫికేష‌న్స్‌..

Odysse Snap, E2 specs : ఒడిస్సీ స్నాప్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లో 2kW ఎలక్ట్రిక్ మోటారును అమ‌ర్చారు. ఇది గంట‌కు, గరిష్టంగా 60kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఈ మోటారుకు AIS156 సర్టిఫైడ్ స్మార్ట్ బ్యాటరీ (LFP) నుంచి శ‌క్తి అందుతుంది. ఫుల్ చార్జి కావ‌డానికి 4 గంటల స‌మ‌యం ప‌డుతుంది. ఇక రేంజ్ విష‌యానికొస్తే. సింగిల్ చార్జిపై 105 కిమీ రేంజ్ ని అందిస్తుంది. ఈ EV ద్విచక్ర వాహనంలో బ్యాటరీ లెవ‌ల్స్ ను పర్యవేక్షించడానికి అలాగే, బ్యాట‌రీలో ఉన్న చార్జింగ్ ను బ‌ట్టి మీరు ఎంత దూరం వెళ్లవచ్చో తెలిపే వివ‌రాలు డిస్‌ప్లేపై చూపిస్తుంది. అదనంగా, ఇది సులభంగా రైడింగ్ కోసం క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది.

ఇక Odysse E2 Electric Scooter లో స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇది 250W ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఒడిస్సే E2 లో వినియోగించిన‌ బ్యాటరీ స్పెసిఫికేష‌న్ల‌ను కంపెనీ ఇంకా వెల్ల‌డించ లేదు. కానీ ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 70 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ్చు. బ్యాట‌రీ 4 గంటల్లో ఫుల్ చార్జి అవుతుది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *