
కొత్త ఎలక్ట్రిక్ రెనాల్ట్ క్విడ్ ఇ-టెక్ దక్షిణ అమెరికాలో అధికారికంగా ప్రారంభించబడటానికి ముందు బ్రెజిల్ రోడ్లపై మొదటిసారిగా కనిపించింది. ఇది రోడ్ టెస్టింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
Kwid E-Tech Electric car ను ఇప్పటికే చైనాలో విక్రయిస్తున్నారు. ఇక్కడ దీనిని సిటీ K-ZE అని పిలుస్తారు. బ్రెజిల్‌లోని రోడ్స్ పై ఎలక్ట్రిక్ క్విడ్ పరీక్షలు చేస్తున్నారు. రెనాల్ట్ ఇప్పటికే చైనాలో ఎలక్ట్రిక్ క్విడ్‌ను విక్రయిస్తోంది. అయితే భారతదేశంలో ఈ car ని ప్రారంభించే ప్రణాళికలు ఇప్పటికిప్పుడు లేవని తెలుస్తోంది.
Kwid Electric car స్పెసిఫికేషన్స్
క్విడ్ ఇ-టెక్ ఫేస్‌లిఫ్టెడ్ రెనాల్ట్ క్విడ్‌పై ఆధారపడింది. కానీ క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది. బ్రెజిల్‌లో గుర్తించబడిన కారు చైనాలో విక్రయించిన సిటీ K-ZEని పోలి ఉంది. అయితే రెనాల్ట్ యూరోపియన్ డాసియా స్ప్రింగ్‌లో అందించిన దాని కంటే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును అమర్చింది. యూరప్‌లోని ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 44hp పవర్ 125Nm శక్తిని కలిగి ఉంది. ఇందులో 26.8kWh బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇది నగరంలో సింగల్ ఛార్జ్ పై 295km (WLTP సైకిల్) పరిధిని అందిస్తుంది. సిటీ K-ZE అదే బ్యాటరీ ప్యాక్, పవర్ ఫిగర్‌లను కలిగి ఉంది. క్లెయిమ్ చేయబడిన పరిధి 271కిమీ (NEDC సైకిల్). ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
కాగా రెనాల్ట్ ఇండియా K-ZE హ్యాచ్‌బ్యాక్‌ను “వచ్చే రెండేళ్లలో” భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు 2020లో ప్రకటించింది. అయితే, ఈ మోడల్ సమీప భవిష్యత్తులో భారత్‌కు రాదని తెలుస్తోంది. అయితే, రెనాల్ట్ ప్రీమియం మెగానే ఇ-టెక్ ఆల్-ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌ను ప్రారంభించడాన్ని పరిశీలిస్తోంది.
ఇండియాలో క్విడ్ సక్సెస్
భారతదేశంలో రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ 2015 నుండి భారతీయ మార్కెట్లో ఉంది. ఈ క్విడ్ హాచ్‌బ్యాక్ car ఇక్కడ భారీ విజయాన్ని అండుకుంది. క్విడ్ 2016లో ప్రతిష్టాత్మకమైన ఆటోకార్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 2019లో, రెనాల్ట్ భారతీయ మార్కెట్ కోసం ఫేస్‌లిఫ్టెడ్ క్విడ్‌ని విడుదల చేసింది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది – 54hp, 0.8-లీటర్ మరియు 68hp, 1.0-లీటర్ యూనిట్. రెండోది ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ AMT ఎంపికతో వస్తుంది. క్విడ్ car భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న డాట్సన్ రెడిగో మరియు మారుతి ఆల్టో వంటి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లకు పోటీ ఇస్తోంది.
For more videos click Harithamithra
Nice