Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Watch | ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సెల్ఫ్ డ్రైవ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

Spread the love

Ola Solo Electric Scooter | ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ తీసుకొస్తోంది. Ola Solo అని పిలవబడే ఈ స్కూటర్ వివరాలు కంపెనీ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్లడయ్యాయి. ఓలా సహ-వ్యవస్థాపకుడు, CEO, భవిష్ అగర్వాల్ కూడా తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో సెల్ఫ్-రైడ్ స్కూటర్ వీడియోను షేర్ చేశారు. ఏప్రిల్ 1న మొదటిసారిగా టీజ్‌చేసిన ఓలా సోలో ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ప్రాంక్ వీడియోగా అంద‌రూ భావించారు. అయితే ఇది నిజమైన నమూనా అని తేలింది. ఓలా సీఈవో భ‌విష్ అగర్వాల్ తన X హ్యాండిల్‌పై అప్‌లోడ్ చేసిన వీడియోలో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ ఆన్‌బోర్డ్ లేకుండా స్కూట‌ర్ న‌డుస్తున్న‌ట్లు చూడవచ్చు.

సెల్ఫ్ రైడింగ్ టెక్నాలజీతో..

అగర్వాల్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. సోలో ”  ఓలా  ఇంజనీరింగ్ బృందాలు భవిష్యత్తులో రానున్న ద్విచక్ర వాహనాలలో సెల్ఫ్ డ్రైవింగ్ , సెల్ఫ్ బ్యాలన్సింగ్ టెక్నాలజీపై  పని చేస్తుందని  పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ సోలో స్థానికంగానే  తయారు చేయబడిందని తెలిపారు.

Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Ola Solo Electric Scooter తప్పనిసరిగా ఓలా QUICKIE.AI సాఫ్ట్‌వేర్ కోసం ఒక టెస్ట్ బెడ్. ఇది స్ప్లిట్-సెకండ్ నిర్ణయాలు తీసుకోగలదు. AI దేశీయంగా అభివృద్ధి చేయబడిన LMAO 9000 చిప్‌తో ఆధారితమైనది. ఇది వీధుల్లో సులభంగా నావిగేట్ చేయడానికి రియల్ టైం  ట్రాఫిక్ డేటాను విశ్లేషిస్తుంది. ఇది ఎలక్ట్రోస్‌నూజ్ క్వాంటం ద్వారా ప్రారంభించబడిన ‘విశ్రమ్’ ఫీచర్‌తో కూడా వస్తుంది. ఈ స్కూటర్ సమీపంలోని హైపర్‌చార్జర్‌ను కనుగొని, చార్జింగ్ పెట్టుకునేలా సూచిస్తుంది.


JU-Guard అనే అధునాతన టెక్నాలజీతో రూపొందించిన అల్గారిథం. ఇది రైడ్ నమూనాలను మాత్రమే విశ్లేషిస్తుంది. సౌకర్యవంతమైన రైడ్‌ ఇచ్చేలా  పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్లు, ఇతర అన్ని అడ్డంకులను గమనిస్తుంది.  ఇది హ్యూమన్ మోడ్‌తో వస్తుంది.

ఓలా సోలో స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ కాన్సెప్ట్ దశలోనే ఉందని స్పష్టంగా తెలుస్తుంది.  ఓలా  ప్రస్తుత S1 మోడల్‌లు సెల్ఫ్ డ్రైవ్  సాంకేతికతను డెవలప్ చేసేందుకు  టెస్ట్ బెడ్‌లుగా ఉపయోగిస్తున్నారు.  అన్ని పరీక్షలు పూర్తయ్యాక  మార్కెట్‌ లోకి వచ్చినపుడు  ఇది పూర్తిగా భిన్నమైన స్టైల్ తో రావచ్చు.  కాబట్టి ఈ సమయంలో స్పెక్స్ ఊహించలేము. అలాగే, సోలో కోసం లాంచ్  టైమ్‌లైన్‌ ఇంకా తెలియదు..   ఇంతకుముందు,  Liger Mobilty  X,   X+ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ ను  ప్రదర్శించింది. అయినప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ సోలోతో ఫుల్ ఆటోనామస్ టెక్నాలజీ కలిగి ఉంటుందని క్లెయిమ్ చేస్తుంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు