Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Spread the love

Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే..

Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే..
ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి స్మారట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీ.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది.

 

ఈ Elecric scooter లో స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీని అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవాట్ల సామర్థ్యం గల పవర్ ట్రైన్, సీఏఎన్ బేస్డ్ చార్జర్ ఉంటాయి. ఇందులో మూడు రకాల రన్నింగ్ మోడ్‌లు ఉంటాయి. ఎటువంటి ఓటీఏ ఫర్మ్ వేర్ అప్‌డేట్లనైనా వెంటనే అందుకునేలా ఈ స్కూటర్ డిజైన్ చేసినట్లు ప్యూర్ ఈవీ కంపెనీ ప్రకటించింది. ప్రతి రోజూ 100 కి.మీ. దూరం ప్రయాణించే వారిని పరిగణనలోకి తీసుకుని రూపొందించినట్లు ప్యూర్ ఈవీ కో-ఫౌండర్ కం సీఈఓ రోహిత్ వడేరా ఈ స్కూటర్ లాంచ్ సందర్బంగా పేర్కొన్నారు.

ePluto 7G Max ధర

ePluto 7G Max price : ఈ స్కూటర్​లో 3.5 కేడబ్ల్యూహెచ్​ లిథియం- ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఇది 60,000 కి.మీ స్టాండర్డ్​ బ్యాటరీ వారెంటీ, 70,000 కి.మీ ఎక్స్​టెండెడ్​ కి.మీ వారెంటీ అందిస్తున్నారు.ఈ వెహికిల్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 201 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎక్స్​షోరూం ధర రూ. 1,14,999. కంపెనీఅధికారిక వెబ్​సైట్​, డీలర్​షిప్​ షోరూమ్స్​లో బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఈప్లూటో మ్యాక్స్ స్మార్ట్ ఫీచర్లు

ఇక ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎల్​ఈడీ లైట్లు ​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, స్మార్ట్​ రీజనరేటివ్​ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రివర్స్​ మోడ్​తో పాటు పార్కింగ్​ అసిస్ట్​ ఫీచర్​ కూడా వస్తోంది. ఆటో పుష్​ ఫంక్షన్​తో 5 కేఎంపీహెచ్​ స్టడీ స్పీడ్​లో వెళ్లే వీలు ఉంటుంది. అంటే.. మేన్యువల్​గా మనం పుష్​ ఇవ్వాల్సిన అవసరం ఉండదు..


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..