Qargos F9 cargo two-wheeler | టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వినూత్నమైన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. విలువైన సమయాన్ని, డబ్బును, శ్రమను తగ్గిస్తూ సరికొత్త ఉత్పత్తులు మార్కెట్ లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్లో ఫిబ్రవరి 12న జరిగిన డస్సాల్ట్ సిస్టమ్స్ 3డిఎక్స్‌పీరియన్స్ వరల్డ్ 2024 ఎక్స్‌పోజిషన్‌లో ఓ ఎలక్ట్రిక్ వాహనం అందరినీ కట్టిపడేసింది. దీన్ని పూణేకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ రూపొందించింది. లాస్ట్ మైల్ డెలివరీల కోసం తయారు చేసిన ఈ కార్గో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అందరి దృష్టిని ఆకర్షించింది.
సురక్షితమైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన పద్ధతిలో డెలివరీ చేయడానికి కాస్టొమైజ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని తయారు చేసినట్లు కార్గోస్ సహ వ్యవస్థాపకుడు అలోక్ దాస్ ఆటోకార్ ప్రొఫెషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సరుకులతో ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు రైడర్‌లకు ఇబ్బంది లేకుండా వినూత్న పరిష్కారం అందించగలదు. కొత్తగా ఆవిష్కరించిన Qargos F9 ఎలక్ట్రిక్ కార్గొ ద్విచక్రవాహనం డెలివరీ బాయ్స్‌కి, అత్యవసర వైద్యసేవలకు చక్కగా ఉపయోగపడనుంది.
డిజైన్ కోసం సాలిడ్‌వర్క్స్‌తో సహా డస్సాల్ట్ సిస్టమ్స్ యొక్క 3DE ఎక్స్‌పీరియన్స్ సూట్‌ను కంపెనీ ఉపయోగించింది. ఇది ప్రస్తుతం ప్రముఖ గ్లోబల్ కంపెనీలచే పరీక్షించబడుతోంది. Qargos రద్దీగా ఉండే భారతీయ నగరాల్లో ఫస్ట్ రెస్పాన్స్ వెహికిల్ గా రెండు చక్రాలపై అంబులెన్స్‌గా F9 వాహనాన్ని ఉపయోగించనున్నారు.
Qargos F9 cargo two-wheeler లో 4.7kWh ఫిక్స్‌డ్ Li-ion బ్యాటరీని వినియోగించారు ఇది వెనుక వైపు ఉన్న -హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఇది 200 Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. మేడ్-ఇన్-ఇండియా ఎర్గోనామిక్ కార్గో-ట్రాన్స్‌పోర్టింగ్ EV .. రెండు చక్రాలపై స్వదేశీంగా రూపొందించిన స్టీల్ ఛాసిస్‌ను పొందింది. ఇది రైడర్ సీటు ముందు 100kg-పేలోడ్ కెపాసిటీ కార్గో క్లోజ్డ్ కంపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంటుంది. ముందు చక్రానికి రైడర్ సీటు మధ్యలో ఈ కంపార్ట్ మెంట్ ఉన్నా కూడా రైడింగ్ కు ఇబ్బంది ఉండదు. Qargos F9 40కి పైగా దేశాలలో 100 కంటే ఎక్కువ డిజైన్ పేటెంట్లను పొందిందని కంపెనీ పేర్కొంది.
ఐదేళ్లలోపు ఒక మిలియన్ యూనిట్ల విక్రయాలు చేపట్టాలని లక్ష్యం పెట్టుకుంది. ఇ-కామర్స్ డెలివరీ విభాగం తోపాటు “మేము పాల విక్రేతలు, కొరియర్ డెలివరీ కంపెనీలు, MSMEలు, రక్షణ, అలాగే ఈ-కామర్స్ సంస్థలను పరిశీలిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ప్రముఖ లాజిస్టిక్స్ ప్లేయర్ నుండి 500 యూనిట్ల కోసం ప్రీ-ఆర్డర్‌ను అందుకుంది. పూణే సమీపంలోని చకన్‌లో 200,000 చదరపు అడుగుల స్థలంలో 50,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు అలోక్ దాస్ తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.