solar villege Kondareddypalli

Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిప‌ల్లి.. ఇంటింటి సర్వే షురూ..

Spread the love

Kondareddypalli | రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న స్వ‌గ్రామ‌మైన కొండారెడ్డిప‌ల్లిని తెలంగాణ‌లోనే పూర్తిస్థాయి సోల‌రైజ్డ్ గ్రామంగా తీర్చ‌దిది్దాల‌ని నిర్ణ‌యించారు. ఈమేర‌కు సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో కొండారెడ్డిప‌ల్లి గ్రామాన్ని మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మంగ‌ళ‌వారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మ‌న్, ఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌ర్ సంతోష్‌, రెడ్కో వీసీ, ఎండీ అనిల‌, సంస్థ డైరెక్ట‌ర్ కె.రాములు, త‌దిత‌ర ముఖ్య అధికారులు.. కొండారెడ్డిప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. గ్రామ‌స్తులు, రైతులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో అధికారులు మాట్లాడారు. ఈ పైల‌ట్ ప్రాజెక్టు వివ‌రాలు తెలిపారు.  కొండారెడ్డిప‌ల్లి గ్రామంలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేట‌గిరీలు అన్నీ కలుపుకుని మొత్తం 1451 వినియోగదారులు ఉన్నారు. ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు గాను అధికారులు ఇంటింటి స‌ర్వే ప్రారంభించారు. ఈ స‌ర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ సామ‌ర్థ్యాన్ని అంచనా వేసి డీపీఆర్ త‌యారు చేసి, త‌దుప‌రి ప్ర‌క్రియ‌ల‌ను ప్రారంభించ‌నున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Tata Festival of Cars

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Biggest Boot

Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఏది బెస్ట్‌.. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యానికి సవాలు న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల...