
Solar Project in Telangana : తెలంగాణలో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే భారీ సోలార్ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ (Sun Petrochemicals) ఆసక్తి కనబరిచింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ (Davos) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద డీల్ ఇదే.
సన్ పెట్రో కెమికల్స్ సంస్థ (Sun Petrochemicals) రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని సంతకం చేసింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.
ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5చ440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 7000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరో కీలక ఒప్పందం
దావోస్లో తెలంగాణ రైజింగ్ టీం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో అధునాతన అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (UAV) తయారీ యూనిట్ ఏర్పాటు కు ముందుకు వచ్చింది జెఎస్‌డబ్ల్యూ సంస్థ. రూ.800 కోట్లతో ఈ యునిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్ డబ్ల్యూ ప్రకటించింది. జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన JSW UAV లిమిటెడ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారనుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..