Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Electric scooter | మార్కెట్‌లో మ‌రో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. గంట‌లోనే చార్జింగ్‌.. మైలేజీ, ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..

Spread the love

Electric Two Wheelers | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్, అల్ట్రావయోలెట్ (Ultraviolette), భారతదేశంలో తన మూడవ ఆఫర్ – టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Tesseract electric scooter) ను ప్రారంభించింది. దీని ధ‌ర (ఎక్స్ షోరూం) రూ. 1.45 లక్షలు. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 10,000 మంది కస్టమర్లకు రూ. 1.20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంటుంది. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత వివరంగా పరిశీలిద్దాం.

Tesseract electric scooter : ఫీచ‌ర్లు ఏమున్నాయి?

టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సాంకేతికతను కలిగి ఉంది. ఇది నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్కూటర్ 14-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను క‌లిగి ఉంది. ఈ స్కూట‌ర్ చూడ్డానికి కూడా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్ లా ఉంటుంది. కొత్త‌ స్కూటర్ లో భారీ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను పొందుప‌రిచారు.

ఈ స్కూటర్‌లో డ్యూయల్ రాడార్లు, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్‌ను ఎనేబుల్ చేసే ముందు, వెనుక కెమెరాల రూపంలో సెక్యూరిటీ కూడా ఉంది. ఈ స్కూటర్ F77 నుంచి డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి కొంత సాంకేతికతను క‌లిగి ఉంది.

Tesseract ev : మూడు బ్యాట‌రీ వేరియంట్లు..

టెస్సెరాక్ట్ మూడు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వ‌స్తుంది. 3.5kWh, 5kWh, 6kWh. ఇది 2.9 సెకన్లలో 0–60kmph వేగాన్ని అందుకోగలదు. సింగిల్ చార్జిపై 261km IDC పరిధిని అందిస్తుంది. స్కూటర్ గరిష్టంగా 125kmph వేగంతో దూసుకుపోతుంది. బ్యాటరీ ప్యాక్‌ను కేవ‌లం గంటలోపు 0–80 శాతం ఛార్జ్ చేయవచ్చు. కొత్త అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ మూడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది: డెజర్ట్ సాండ్, స్టీల్త్ బ్లాక్ మరియు సోనిక్ పింక్. అలాగే, కంపెనీ టెస్రాక్ట్ కోసం అనేక ఉపకరణాలను అందిస్తుంది. 2026 మొదటి అర్ధభాగంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..