Harithamithra Telugu News

Home EV Updates EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

0
Biggest Ola Season Sale
Biggest Ola Season Sale

Ola Electric launches Biggest Ola Season Sale |  ద‌స‌రా, దీపావ‌ళి ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ ‘BOSS – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్’ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు.

బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ ని ప్రారంభించింది. దీని కింద, కంపెనీ తన S1 పోర్ట్‌ఫోలియోలో ₹49,999 కంటే తక్కువ ధరకు స్కూట‌ర్ కొనుగోలు చేయొచ్చు. అదనంగా, కంపెనీ గరిష్టంగా ₹40,000 వరకు పండుగ ప్రయోజనాలను అందుకోవ‌చ్చు. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్‌లు ఆఫర్‌లు ఉన్నాయి.

BOSS ప్రయోజనాలు ఇవే..

ధరలు: Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ప్రారంభమవుతుంది (పరిమిత స్టాక్)
డిస్కౌంట్స్‌ : ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై ₹25,000 వరకు

  • S1 X 2kWhపై ₹25,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్,
  • S1 పోర్ట్‌ఫోలియోపై ₹15,000 వరకు తగ్గింపు

వారంటీ: ₹7,000 విలువైన 8-సంవత్సరాలు/80,000 కిమీ బ్యాటరీ వారంటీ ఉచితం
ఫైనాన్స్ ఆఫర్‌లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMIలపై ₹5,000 వరకు ఫైనాన్స్ ఆఫర్‌లు
BOSS ప్రయోజనాలు: ₹6,000 విలువైన MoveOS+ అప్‌గ్రేడ్; గరిష్టంగా ₹7,000 విలువైన ఉచిత హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు

కంపెనీ ఏం చెబుతోంది..?

కొత్త ఆఫ‌ర్‌పై ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్, MD భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, “ ఈ పండుగ సీజన్‌లో మా కస్టమర్‌ల కోసం కొత్త‌ ఆఫర్‌ల స‌మ్మేళ‌నం BOSS కార్య‌క్రామ‌న్ని తీసుకువ‌చ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. ఇది EVని కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయం. BOSS అనేది మా అతిపెద్ద పండుగ ఆఫర్, మేము మా మిషన్‌తో #EndICEAgeని కొనసాగిస్తున్నాం. దేశవ్యాప్తంగా EV వ్యాప్తిని మరింతగా పెంచుతాము. అతిపెద్ద డిస్కౌంట్‌లు, ఉత్తమ డీల్స్, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్‌లతో, EVలు కొనుగోలు చేయ‌డానికి ఇది సరైన సమయం.

సర్వీస్ పై కంపెనీ కీలక అడుగు

గత నెలలో, Ola Electric భారతదేశం అంతటా తన సేల్స్‌, సేవా నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతో నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద Ola Electric 2025 చివరి నాటికి నెట్‌వర్క్‌ను 10,000కి పెంచాలని యోచిస్తోంది. అదనంగా, Ola Electric భారతదేశంలోని ప్రతీ మెకానిక్‌ని EV-సిద్ధంగా చేయడానికి 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇస్తోంది.

ఓలా ఈవీ కస్టమర్ల కోసం మంచి ఎక్స్ పీరియ‌న్స్ అందించేందుకు Ola Electric ఇటీవల #HyperService కాంపేయినింగ్‌ ప్రకటించింది. దీని కింద, కంపెనీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయాలని యోచిస్తోంది. త‌మ వినియోగదారుల కోసం ఫాస్ట్ -స‌ర్వీస్ చేస్తామ‌ని భ‌రోసా ఇస్తోంది. ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీలో మొదటి AI- ఆధారిత ప్రోయాక్టివ్ మెయింటెనెన్స్ & డయాగ్నోస్టిక్‌ల ను రూపొందించింది.

మ‌రోవైపు Ola Electric విభిన్నమైన అవ‌స‌రాలు క‌లిగిన‌ కస్టమర్‌ల కోసం ఆకర్షణీయమైన ధరల పాయింట్‌లలో ఆరు ఆఫర్‌లతో విస్తృతమైన S1 పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. ప్రీమియం ఆఫర్‌లు ఓలా S1 Pro మరియు ఓలా S1 ఎయిర్‌ల ధర వరుసగా ₹1,34,999 మరియు ₹1,07,499. ఇక మాస్ మార్కెట్ ఆఫర్‌లలో S1 X పోర్ట్‌ఫోలియో (2 kWh, 3 kWh మరియు 4 kWh) ధరలు వ‌రుస‌గా ₹74,999, ₹87,999. ₹101,999.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Previous articleఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..
Next articleOil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here