Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తర దేశాల నుంచి లక్ష కోట్లు పెట్టి పామ్‌ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి క...