
Eco Friendly Park : 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు
Eco Friendly Park in Hyderabad : పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించేందుకు.. ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్ పీరియం’ పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలను ఇక్కడ చూడవచ్చు. మెక్సికో, అర్జెంటీనా, ఉరుగ్వే, దక్షిణ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి అత్యంత అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలలు సేకరించి అందరినీ ఆకట్టుకునేలా ఈ ఎకో పార్క్ (Eco Park) ను నిర్మించారు.ఈ పార్కు నిర్మాణానికి సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5 లక్షల నుంచి కోటి వరకు వెచ్చించారు. 1,500 మంది క...