
Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది.సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు 1.3kWh ప్యాక్ (పోర్టబుల్) రెండు బ్యాటరీలు ఉన్నాయి. కొత్త స్కూటర్ చూడడానికి గత మోడల్ లాగే ఉన్నప్పటికీ, కంపెనీ కొన్ని నిఫ్టీ ఎలక్ట్రానిక్ ట్రిక్రీ, మరింత సమర్థవంతమైన డ్రైవ్‌ట్రెయిన్ ద్వారా రేంజ్ ను 248 కి.మీ.కు పెంచగలిగింది. 136 కిలోల బరువుతో, సింపుల్ వన్ బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. 796mm సీటు ఎత్తుున కలిగి ఉంది. మిగతా ఈవీ స్కూటర్ల తో పోలిస్తే ఇది కాస్త పోడవుగా ఉంటుంది .అప్డేట్ లు ...