Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Telangana Government

Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Agriculture
Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ ఇదిలాఉండగా.. ఈ మంత్రి వర్గ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా చర్చించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అమలయ్యాయి.. ఇంకా ఎలాంటి హామీలు నెరవార్చాలి అనేదానిపై చర్చించారు. అలాగే పలు హామీలు నెరవేర్చేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీలు సమర్పించిన నివేదిక...
Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

E-scooters, Solar Energy
Solar news | సుస్థిర ఇంధన విధానాలు, సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేశారు. టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీ ఆర్‌ఈడీసీఓ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల వావిళ్ల, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సురేందర్‌తో కలిసి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు.ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్థులతో కలిసి వివరించారు. గ్రామంలో 1,039 మంది గృహ వినియోగదారులు, 520 మంది  వ్యవసాయ వినియోగదారులు (రైతులు) ఉన్నారు. కాగా గృహ వినియోగదారులకు సంబంధించి సర్వే పూర్తయింది. ఇప్పటివరకు దాదాపు 50 శాతం వ్యవసాయానికి సంబంధించి విద్యత్ వినియోగంపై  సర్వే చేశారు. మిగిలినవి వచ్చే మూడు రోజుల్లో పూర...
ORR Cycle Track | ఓఆర్‌ఆర్ పై ఎలక్ట్రిక్ సైకిల్ పై దూసుకెళ్లండి.. ఇపుడు అందుబాటులోకి కిరాయి సైకిళ్లు..

ORR Cycle Track | ఓఆర్‌ఆర్ పై ఎలక్ట్రిక్ సైకిల్ పై దూసుకెళ్లండి.. ఇపుడు అందుబాటులోకి కిరాయి సైకిళ్లు..

General News
ORR Cycle Track  | హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డు సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్ పై ఇపుడు సైకిళ్ల చ‌క్క‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఆరోగ్యం, పర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌న‌ను దృష్టిలోపెట్టుకొని నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత బీఆర్ ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ వ‌ర‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించింది. అలాగే ప్రత్యేక చొరవతో సైకిల్‌ ట్రాక్ పై సోలార్ కరెంట్ ఉత్పత్తి చేయడంతో పాటు దాని వెలుతురులో హాయిగా సైక్లింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సొంత సైకిళ్లు ఉన్న వారు నేరుగా ఈ ట్రాక్‌పై సైక్లింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇక సైకిల్‌ లేని వారు కూడా సైకిల్ ను అద్దెకు తీసుకునే అవకాశం అందుబాటులోకి వ‌చ్చింది.ORR Cycle Track ప్రస్తుతం ఔట‌ర్ రింగ్ రోడ్ పై మొదటి సైకిల్‌ స్టేషన్‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు ...