2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
Top electric car launches in 2023 | 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పలు ఆసక్తికర ఆవిష్కరణలకు వేదికైంది. ఇది భారతదేశంలో EVలపై పెరుగుతున్న డిమాండ్ ను ఇది ప్రతిబింబిస్తుంది. వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త ఈవీలు ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం విడుదల చేసిన కొత్త EVలను ఒకసారి చూద్దాం.
మహీంద్రా XUV400
Top electric car launches in 2023 : XUV300 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ అయిన మహీంద్రా XUV400 లాంచ్‌తో 2023 సంవత్సరం ప్రారంభమైంది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెండు బ్యాటరీ ఆప్షన్ల (EC మరియు EL )తో వస్తుంది. అ 34.5 kWh యూనిట్, 39.4 kWh యూనిట్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా సింగిల్ చార్జిపై 375 కిమీ , 456 కిమీ. ఆసక్తికరంగా.. ఈ రెండు యూనిట్లు 150 bhp , 310 Nm టార్క్ నుఉత్పత్తి చేస్తాయి. ఇది టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇస్తుంది.
హ్య...