లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ
Joy e-bike offers : భారతదేశంలో 'జాయ్ ఇ-బైక్' (Joy e-bike) బ్రాండ్ తో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది.2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క మొట్టమొదటి లిస్టెడ్ EV కంపెనీగా, వార్డ్‌విజార్డ్ 2018లో దాని మొట్టమొదటి తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్, బటర్‌ఫ్లైని పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ 10 మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో హై స్పీడ్, లో -స్పీడ్ వేరియంట్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750కి పైగా టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ ను పెంపొందించుకుంది.కాగా లక్ష యూనిట్ల సేల్స్ మైలురాయిని పురస్కరించుకుని, కంపెనీ ...