
Tata Nexon Tiago EV prices | ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. టాటా మోటార్స్ Nexon EV, Tiago EV లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుతం, రెండు మోడళ్ల ప్రారంభ ధరలను వరుసగా రూ. 25,000 మరియు రూ. 70,000 తగ్గించింది . టాటా మోటార్స్ ప్రకారం, ఇటీవలి కాలంలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గడం వల్ల ఈ డిస్కౌంట్లను లాభాపేక్ష లేకుండా నేరుగా వినియోగదారులకు అందిస్తోంది. Tata Nexon, Tata Tiago EV మోడళ్లకు ధర తగ్గింపు ఉన్నప్పటికీ, Tata Motors ఇటీవల ప్రవేశపెట్టిన పంచ్ EV ధరలను మాత్రం తగ్గించలేదు. ఎందుకంటే ఇది ఇప్పటికే తగ్గిన బ్యాటరీ ధరల్లోనే లాంచ్ అయింది. అలాగే, టిగోర్ EV ధరల్లో కూడా మార్పు లేదని కంపెనీ వెల్లడించింది.
Tiago EV సమీప ప్రత్యర్థి అయిన MG Comet EV ధర కూడా ఇటీవలే రూ. 1.40 లక్షల వరకు తగ్గించింది. ఈ నేపథ్యంలో. మార్కెట్ లో అమ్మకాలను పెంచడానికి టాటా మోటార్స్ కూడా ధరలు తగ్గించి కొనుగోలుదారులకు తీపి కబురు అందించింది.
Tata Nexon Tiago EV prices: ధర తగ్గింపుపై వ్యాఖ్యానిస్తూ, TPEM చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీలదే ఎక్కువ భాగం ఉంటుంది. బ్యాటరీ సెల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గినందున భవిష్యత్తులో వాటి కూడా తగ్గింపును పరిగణనలోకి తీసుకుని, ఫలితంగా వచ్చే ప్రయోజనాలను నేరుగా కస్టమర్‌లకు అందించాలని మేము నిర్ణయించుకున్నాము.
టాటా టియాగో ఈవీ ధరలు (ఎక్స్ షోరూం)
వేరియంట్ | కొత్త ధర | పాత ధర | తేడా |
---|---|---|---|
XE MR | రూ.7.99 లక్షలు | రూ.8.69 లక్షలు | రూ.70,000 |
XT MR | రూ. 8.99 లక్షలు | రూ.9.34 లక్షలు | రూ.35,000 |
XT LR | రూ.9.99 లక్షలు | రూ.10.29 లక్షలు | రూ.20,000 |
XZ LR | రూ.10.89 లక్షలు | రూ.11.09 లక్షలు | రూ.20,000 |
XZ టెక్ LUX LR | రూ.11.39 లక్షలు | రూ.11.59 లక్షలు | రూ.20,000 |
XZ LR (7.2 kW ఛార్జర్‌తో) | రూ.11.39 లక్షలు | రూ.11.59 లక్షలు | రూ.20,000 |
XZ టెక్ LUX LR (7.2 kW ఛార్జర్‌తో) | రూ.11.89 లక్షలు | రూ.12.09 లక్షలు | రూ.20,000 |
“గత కొన్నేళ్లుగా భారత్ లో EVల స్వీకరణ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా EVలను, గ్రీన్ మొబిలిటీని వేగవంతం చేయడం మా లక్ష్యం. మా స్మార్ట్, ఫీచర్-రిచ్ EVల కోసం మా పోర్ట్‌ఫోలియో ఇప్పటికే అనేక రకాల బాడీ స్టైల్స్, విభిన్న రేంజ్ లు, ధరలలో అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న Nexon.ev, Tiago.ev ల ధరలు తగ్గడం వల్ల మరింత మంది కొనుగోలు దారులను ఆకర్షిస్తుందని మేము విశ్వసిస్తున్నాము అని శ్రీవాస్తవ తెలిపారు.
టాటా నెక్సాన్ ఈవీ ధరలు (ఎక్స్ షోరూం)
[table id=26 /]
జనవరి 2024లో అమ్మకాలు
వాహన్ డేటా ప్రకారం, జనవరి 2024లో, టాటా మోటార్స్ డిసెంబర్ 2023లో 5,001 వాహనాలను విక్రయించగా జనవరిలో 5,543 వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. ఈ అద్భుతమైన పనితీరు నెలవారీగా 11% వృద్ధిని చూసింది. ఇది మార్కెట్ షేర్ లో 68.61 % వాటాను ఆక్రమించింది.
[table id=25 /]
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..