Top Electric scooters in India 2025 : భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2025 లో దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నటాప్ 5 ఎలక్ట్రిక్ టూ స్కూటర్లను పరిశీలిద్దాం..

టీవీఎస్ ఆర్బిటర్
టీవీఎస్ మోటార్స్ తన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్ (TVS Orbiter) ను గత నెలలో రూ. 99,990 (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఆర్బిటర్ లో3.1kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫుల్ ఛార్జ్‌పై 158 కిలోమీటర్ల IDC రేంజ్‌అందిస్తుందని టీవీఎస్ పేర్కొంది. బ్లూటూత్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ ఫంక్షన్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడా ఇందులో చూడవచ్చు.
ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ (జనరేషన్ 3)
ఈ ఏడాది ఆగస్టులో ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో స్పోర్ట్ జెన్ 3 (Ola S1 Pro Sport (Gen 3)) ని ప్రారంభించింది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ.1.50 లక్షలు. కస్టమర్లు రూ. 999కి S1 ప్రో స్పోర్ట్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కొత్త ఓలా స్కూటర్ డెలివరీలు జనవరి 2026లో ప్రారంభమవుతాయి. కొత్త ఓలా S1 ప్రో స్పోర్ట్ S1 ప్రో+ యొక్క 5.3 kWh యూనిట్‌తో పోలిస్తే 5.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఓలా 320 కి.మీ.ల IDC రేంజ్ ను క్లెయిమ్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో. బ్యాటరీ ప్యాక్‌ను 15 నిమిషాల్లో 20–80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు,

కైనెటిక్ DX
1980 – 90లలో ఓ ఊపు ఊపిన కైనెటిక్ స్కూటర్ మళ్లీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విపణిలోకి కైనెటిక్ DX (Kinetic DX) పేరుతో వచ్చింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. DX ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వరుసగా రూ. 1,11,499, రూ. 1,17,499 (రెండూ ఎక్స్-షోరూమ్). కొత్త కైనెటిక్ DX ఫ్లోర్‌బోర్డ్ కింద 2.6 kWh LFP బ్యాటరీతో జతచేయబడిన హబ్-మౌంటెడ్ 4.8 kW మోటారును కలిగి ఉంది. ఇది 90 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌కు 102 kmph (బేస్) లేదా 116 km (టాప్-స్పెక్) పరిధిని అందిస్తుంది. ఫ్లాట్ రోడ్లపై 25–30 kmph వద్ద క్రూయిజ్ లాక్‌తో దీని రేంజ్ 150 కి.మీ వరకు ఇస్తుంది.స్కూటర్ మూడు రైడ్ మోడ్‌లను అందిస్తుంది: రేంజ్, పవర్, టర్బో.

హీరో విడా VX2
హీరో మోటోకార్ప్ ఈ ఏడాది జూలైలో విడా VX2 (Hero Vida VX2) ను విడుదల చేసింది. ఇది VX2 గో, VX2 ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర వరుసగా రూ. 99,490, రూ. 1.10 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్). 92 కి.మీ.ల IDC రేంజ్‌తో 2.2 kWh సింగిల్ రిమూవబుల్ బ్యాటరీతో నడుస్తుంది. హీరో మోటోకార్ప్ ప్రకారం, ఇది 4.2 సెకన్లలో 0 – 40 కి.మీ.ph వేగాన్ని అందుకుంటుంది. 70 కి.మీ.ల గరిష్ట వేగంతో నడుస్తుంది. ఇది 4.3-అంగుళాల LCD డిజిటల్ డిస్‌ప్లేతో అమర్చబడి ఉంటుంది. రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది – ఎకో మరియు రైడ్.

అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్
అల్ట్రావయోలెట్ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract). ఇది కంపెనీ తదుపరి తరం ప్లాట్‌ఫామ్‌పై రూపొందించింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 14-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. మొత్తం డిజైన్ కూడా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. స్కూటర్ భారీ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు – 2025
| స్కూటర్ పేరు | ధర (ఎక్స్-షోరూమ్) | రేంజ్ (IDC) | గరిష్ట వేగం | ముఖ్య ఫీచర్లు |
|---|---|---|---|---|
| Ola S1 Pro Sport (Gen 3) | ₹1.50 లక్షలు | 320 km | – | 5.2 kWh బ్యాటరీ, 15 నిమిషాల్లో 20–80% ఫాస్ట్ ఛార్జింగ్, జనవరి 2026 నుంచి డెలివరీలు |
| Ultraviolette Tesseract | ₹1.45 లక్షలు | – | – | ఫ్యూచరిస్టిక్ డిజైన్, 7” TFT టచ్‌స్క్రీన్, డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్ |
| Hero Vida VX2 (Go & Plus) | ₹99,490 – ₹1.10 లక్షలు | 92 km | 70 kmph | 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీ, 0–40 kmph లో 4.2 sec, 4.3” LCD డిస్ప్లే, 2 రైడ్ మోడ్‌లు |
| Kinetic DX | ₹1,11,499 – ₹1,17,499 | 102–116 km (150 km వరకు) | 90 kmph | 2.6 kWh LFP బ్యాటరీ, 4.8 kW మోటార్, 3 రైడ్ మోడ్‌లు (Range, Power, Turbo), క్రూయిజ్ లాక్ |
| TVS Orbiter | ₹99,990 | 158 km | – | 3.1 kWh బ్యాటరీ, డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, రివర్స్ అసిస్ట్ |
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..





