TVS iQube Electric scooter అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ ఆన్-రోడ్ ధర రూ. 99,130 నుంచి రూ. 1.04 లక్షల వరకు ఉంది.
TVS మోటార్ కంపెనీ 2020 జనవరిలో iQube ఇ-స్కూటర్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, గత ఏడాది మేలో ఇది సరికొత్త ఫీచర్లతో సమగ్రమైన అప్‌డేట్ వర్షన్లను తీసుకొచ్చింది. ఈ కొత్త స్కూటర్లపై వినియోగదారుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ కారణంగా TVS iQube Electric scooters పై డిమాండ్ పెరిగి అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటాయి.
2022 మే నెలలో అప్‌డేట్ చేయబడిన TVS iQube లాంచ్ తర్వాత, దాని అమ్మకాలు నెలల తరబడి గణనీయంగా పెరిగాయి. ఇది డిసెంబర్ 2022లో అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. అంతేకాకుండా, దాదాపు 60,000 యూనిట్ల TVQ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ 2022 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో విక్రయించబడింది.
TVS iQube Electric scooters రేంజ్
TVS iQube ఈ-స్కూటర్‌ను స్టాండర్డ్, S అలాగే ST అనే మూడు వేరియంట్‌లలో అందిస్తోంది. స్టాండర్డ్ వెర్షన్ అలాగే iQube S 3.04 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చగా, టాప్- మోడల్ ST లో 4.56 kWh యూనిట్ పొందుపరిచారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 100 కి.మీ, టాప్ వర్షన్ 145 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.
TVS iQube: ధరలు
TVS iQube స్టాండర్డ్ వెర్షన్ ప్రస్తుతం ధర రూ. 99,130 కాగా, ‘S’ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు, (ఆన్-రోడ్ ఢిల్లీ ). iQube ST ధరలు ఇంకా వెల్లడి కాలేదు. ఇది వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. TVS iQube ఈ స్కూటర్‌ల Ola S1, Ather 450X, బజాజ్ చేతక్, Hero Vida V1 వంటి టాప్ బ్రాండ్ ఈ స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.
2 thoughts on “TVS iQube Electric scooter కు భారీ డిమాండ్”