Tata Sierra EV Updates : ఈవీ మార్కెట్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే ఇది అత్యాధునిక డిజైన్, ప్రత్యేక లక్షణాలతో మార్కెట్‌లలోకి వచ్చిన Tata Curvv EV వినయోగదారుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
టాటా యొక్క పోర్ట్‌ఫోలియోలోని కాన్సెప్ట్‌లలో అవిన్య EV, హారియర్ EV, టాటా సియెర్రా EV ఉన్నాయి. సియెర్రా EV కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని “దేశీ డిఫెండర్” అని పిలుస్తున్నారు.
ఆల్-వీల్-డ్రైవ్, ఐదు-సీట్ల SUVగా అంచనా వేసిన సియెర్రా EV సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతా కలిసి ప్రయాణించడానికి ఇష్టపడే కుటుంబాలకు ఇది అత్యుత్తమ వాహనం. టాటా సియెర్రా EV మార్చి 2026లోపు విడుదల చేయనున్నారని అంచనా. దీని ధర ₹25 నుండి ₹30 లక్షల మధ్య ఉంటుంది.
టాటా సియెర్రా EV అంచనా ధర, రేంజ్, కీలక ఫీచర్లు స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు చూద్దాం..
Tata Sierra EV ని మొదటగా ఆల్ట్రోజ్ కోసం ఉపయోగించిన ఆల్ఫా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఆటో ఎక్స్‌పో 2020లో ఒక కాన్సెప్ట్‌గా ఆవిష్కరించారు. కాన్సెప్ట్ 4,150mm పొడవు, 1,820mm వెడల్పు, 1,675mm ఎత్తు, 2,450mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
ఆటో ఎక్స్‌పో 2023లో మరింత రీఫ్రెష్ వెర్షన్ ప్రదర్శించారు. సియెర్రా EV టాటాకు చెందిన Acti.EV ఆర్కిటెక్చర్, పంచ్ EV, రాబోయే హారియర్ EV లాగానే టాటా Gen2 EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారని భావిస్తున్నారు. డిజైన్ పరంగా, సియెర్రా EV ఒరిజినల్ 90s సియెర్రా నుంచి కొన్ని ఐకానిక్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. సిగ్నేచర్ కర్వ్డ్ రియర్ సైడ్ విండోస్, స్క్వారీష్ వీల్ ఆర్చ్‌లు, హై-సెట్ బానెట్ వంటి ముఖ్య ఫీచర్లు అన్నీ కాన్సెప్ట్ నుండి ప్రొడక్షన్ వెర్షన్‌కు తీసుకువెళతాయని భావిస్తున్నారు.
కారు ముందు భాగం దాని మొత్తం వెడల్పులో సొగసైన LED స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది. ఇది వాహనానికి ఆధునిక రూపాన్ని ఇస్తుంది. అలాగే LED బ్రేక్ లైట్ స్ట్రిప్‌తో వెనుకవైపు ఇదే డిజైన్‌ను చూడవచ్చు.
Tata Sierra EV ఇంటీరియర్
స్టీరింగ్ వీల్‌పై పెద్ద డిస్‌ప్లే కింద కొన్ని ఫిజికల్ బటన్‌లు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ కారులోని చాలా ఫీచర్లు టచ్-కంట్రోల్ తో ఉంటాయని భావిస్తున్నారు. టాటా సియెర్రా EV అంతటా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. డూయల్-టోన్ కలర్ స్కీమ్‌తో కలిపి ఈ కారు మినిమలిస్ట్ EV డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంది.
టాటా సియెర్రా EV లక్షణాలు
Tata Sierra EV గురించిన అధికారిక సాంకేతిక వివరాలను టాటా ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ వాహనం రేంజ్ ఒక్కసారి ఛార్జ్‌పై 350 నుండి 400 కిమీల మధ్య ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆటో ఎక్స్‌పో 2023లో వెల్లడించినట్లుగా, డిజైన్ 2-డోర్ కాన్సెప్ట్ నుంచి 5-డోర్ మోడల్‌గా అభివృద్ధి చెందడంతో, శ్రేణిని ప్రభావితం చేయవచ్చు. ఇది మొదట్లో 400+ కిమీల రేంజ్ ఇస్తుందని భావించగా, కాస్త తక్కువ రేంజ్ ఉండే అవకాశముందని తెలుస్తోంది.
టాటా సియెర్రా EV స్పెసిఫికేషన్లు
టాప్ స్పీడ్ | 170 కి.మీ |
రేంజ్ | 400+ కి.మీ |
ఛార్జింగ్ సమయం | 6.0 గంటలు |
బ్యాటరీ | 54.47 kWh |
సియెర్రా EV కూడా LED లైట్లు, ప్రకాశవంతమైన లోగో, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో జత చేయబడిన ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి లక్షణాలతో విలక్షణమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా టాటా సియెర్రా EVలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా ఉంటాయి.
టాటా సియెర్రా EV ధర
Tata Sierra EV Price : టాటా సియెర్రా EV మార్చి 2026 నాటికి లాంచ్ అవుతుందని టాటా ధృవీకరించింది. అయితే దీని ధర అంచనా ₹25 నుండి ₹30 లక్షల వరకు ఉంటుంది., సియెర్రా EV విడుదలైతే మహీంద్రా XUV700 ఎలక్ట్రిక్‌తో పాటు MG ZS EV, హ్యుందాయ్ క్రెటా EV, జీప్ కంపాస్ వంటి ఇతర ప్రత్యర్థులకు మరియు టాటా హారియర్, సఫారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లతో పోటీపడే అవకాశం ఉంది.