Home » వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter

వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter

Ola Electric scooter
Spread the love

Ola Electric scooter
Ola Electric Scooter మార్కెట్‌లోకి విడుద‌ల కాకముంటే దానిపై అన్ని వ‌ర్గాల వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది.  ఒక్క‌రోజులోనే ల‌క్ష‌కు పైగా Ola Scooter ను బుక్ చేసుకున్నారు.  డిమాండ్కు త‌గిన‌ట్లుగా వాహ‌నాల ఉత్ప‌త్తి కోసం సంవత్సరానికి 10 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంద‌ని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం అత్యంత అధునాతనమైనదని, 3,000 కంటే ఎక్కువ AI- ఎనేబుల్ రోబోట్‌లు నిరంత‌రం శ్ర‌మిస్తున్నాయి.

ఆగ‌స్టు 15 కోసం నిరీక్ష‌ణ‌

ఓలా ఎలక్ట్రిక్ తన Ola Electric Scooter కోసం భారతదేశంలోని 1,000 నగరాల నుంచి బుకింగ్స్ స్వీక‌రించిన‌టు్ల శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆగష్టు 15 న విడుద‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్ ఈవెంట్‌పై అప్‌డేట్ చేస్తూ.. ఓలా CEO భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు, కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ సేవల‌ను మొదటి రోజు నుంచే భారతదేశమంతటా అందిస్తుందని తెలిపారు. 1,000కిపైగా నగరాలు, పట్టణాల నుండి త‌మ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం రిజర్వేషన్లు వెల్లువెత్తుతున్నాయి. డెలివరీల మొదటి రోజు నుండి, మేము భారతదేశమంతటా డెలివరీ & సర్వీస్ చేస్తాము. ఆగస్టు 15 న గ్రీన్ రివ‌ల్యూష‌న్‌ను సృష్టిద్దాం! #రివ‌ల్యూష‌న్లో చేరండి ”అని అగర్వాల్ శుక్రవారం ట్వీట్ చేశారు.

గ‌త జూలై 15 సాయంత్రం ఓలే ఎలెక్ట్రిక్ తన Ola Electric Scooter కోసం రూ.499కి రిజర్వేషన్ ప్రారంభించినప్పుడు, మొదటి 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో లక్ష బుకింగ్స్‌ను అందుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా బుక్ చేసుకున్న స్కూటర్‌గా రికార్డు సృష్టించింది. సీఈవో అగర్వాల్ రెండు రోజుల క్రితం ట్వీట‌ర్‌లో ఇ-స్కూటర్ విడుదల తేదీని ప్రకటించారు.ష‌మా స్కూటర్ రిజర్వ్ చేసిన అందరికీ ధన్యవాదాలు! ఆగస్టు 15 న ఓలా స్కూటర్ కోసం లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.  ఉత్పత్తి మరియు లభ్యత తేదీలపై పూర్తి స్పెక్స్ మరియు వివరాలను ప్ర‌క‌టిస్తారు.  దానికోసం వేచి చూస్తున్నా! అంటూ అగర్వాల్ ట్వీట్ చేశారు.

బ‌జాజ్‌, ఏథ‌ర్‌, టీవీఎస్ ఐక్యూబ్‌ల‌కు పోటీ

Ola Electric Scooter ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQube మోడ‌ళ్ల‌తో పోటీపడుతుంది. ఈ మోడల్‌ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ధరను అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. మ‌రోవైపు ఈ-స్కూటర్ 10 రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇన్ని రంగుల్లో అభ్య‌త అనేది మ‌రే కంపెనీలో లేదు. వినియోగ‌దారుల‌కు ఇక్క‌డ ఎక్కువ ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇక స్కూటర్ల తయారీకి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో 500 ఎకరాల విస్తీర్ణంలో కర్మాగారం ఉంది. దీనిని 2,400 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాక్ట‌రీ పూర్త‌యితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన ప‌రిశ్ర‌మ‌గా అవ‌త‌రించ‌నుంది.

ఏడాదికి 10మిలియ‌న్ల యూనిట్లు

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంవత్సరానికి 10 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.  ఇది అత్యంత అధునాతనమైన 3,000 కంటే ఎక్కువ AI- ఎనేబుల్ రోబోట్‌లు ఈ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్నాయి.  ఈ ప‌రిశ్ర‌మ ఆవ‌ర‌ణ‌లో సుమారు100 ఎకరాలకు పైగా గ్రీన‌రీని పెంచుతున్నారు.

One thought on “వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *