Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

Budget For Agriculture : వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు..

Spread the love

Budget For Agriculture  | కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం,  అనుబంధ రంగాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  రూ.1.52 లక్షల కోట్ల మేర భారీగా కేటాయింపులను ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 10 మిలియన్ల మంది రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. సీతారామన్ తన వరుసగా ఏడవ బడ్జెట్ ప్రజెంటేషన్‌లో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించే కార్యక్రమాలను వివరించారు.

బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. సహజ వ్యవసాయం వైపు మళ్లడం అనేది స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడం. సహజ వ్యవసాయం నేల ఆరోగ్యం, జీవవైవిధ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో రైతులకు సాగు ఖర్చులను కూడా తగ్గిస్తుంది, తద్వారా వారి లాభదాయకతను పెంచుతుంది.
పెద్ద ఎత్తున కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రణాళికను కూడా సీతారామన్ ప్రకటించారు. ఉత్పత్తిని పెంచడానికి, దేశవ్యాప్తంగా కూరగాయల సరఫరాను పెంచేందుకు  ఈ క్లస్టర్లు వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. .
వాతావరణాన్ని తట్టుకోగల పంటలు,  డిజిటల్ వ్యవసాయం పై ఆమె మాట్లాడారు. “ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగా సమీక్షిస్తుంది. వ్యవసాయంలో వాతావరణాన్ని తట్టుకోగల రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడతామని సీతారామన్ చెప్పారు, “కొత్త 109 అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల రకాలను రైతులకు అందజేస్తారని, అదనంగా, నూనె గింజల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేయడానికి 10,000 బయో-ఇన్‌పుట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

డిజిటల్ వ్వయసాయం..

రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్ రైతులకు వాతావరణ సూచనలు, పంట సలహా సేవలు, మార్కెట్ ధరల వంటి కీలక సమాచారాన్ని అందిస్తుంది.
25 ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాల్లో ఖరీఫ్ కోసం డిజిటల్ పంటల సర్వే నిర్వహించనున్నారు.జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల జారీ ఐదు రాష్ట్రాల్లో ప్రారంభించబడుతుంది. రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతి కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ [నాబార్డ్] ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా ప్రకటించారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *