Home » Hero motocorp New EV | హీరో మోటోకార్ప్ నుంచి త్వ‌ర‌లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్

Hero motocorp New EV | హీరో మోటోకార్ప్ నుంచి త్వ‌ర‌లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్

Hero motocorp New EV
Spread the love

Hero motocorp New EV | భారత్‌లోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త‌గా అంతర్జాతీయ విప‌ణిలో కూడా తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది.ఈ సంస్థ‌ 2023-24 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించేందుకు తమ వద్ద ప‌టిష్ట‌మైన‌ రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో మొద‌టి స్థానాన్నికైవ‌సం చేసుకోవ‌డానికి హీరో మోటోకార్ప్ 2025 ఆర్థిక సంవత్సరంలో చ‌వ‌కైన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ మోడల్‌ను ప్రారంభించాలని నిర్ణ‌యించింది. ఇది కంపెనీ ప్రస్తుత VIDA V1 ప్రో పోర్ట్‌ఫోలియోను విస్త‌రించ‌నుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మీడియం, సరసమైన విభాగంలో ఉత్పత్తులను ప్రారంభించనుంది. ప్రారంభించబోయే కొత్త మోడ‌ల్ TVS ఐక్యూబ్‌, బ‌జాజ్‌ చేత‌క్‌, Ola సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. . .

చార్జింగ్ సౌక‌ర్యాలు..

Hero MotoCorp VIDA ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి తోపాటు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాను బలోపేతం చేస్తోంది. ఇది సబ్సిడీ పొందిన తర్వాత ధర రూ. 1-1.5 లక్షల మధ్య ఉంటుంద‌ని భావిస్తున్నారు. కంపెనీ, ఏథర్ ఎనర్జీ సహకారంతో, VIDA EVల కోసం భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్త‌రించింది. అంతేఆకుండా జీరో మోటార్‌సైకిల్స్‌తో భాగస్వామ్యంతో, కంపెనీ విదేశీ మార్కెట్‌లకు తన పరిధిని పెంచుకుంటోంది.

హీరో మోటోకార్ప్ ఓవర్సీస్ మార్కెట్ లాంచ్ కోసం సిద్ధమవుతోంది: పవన్ ముంజాల్ మాట్లాడుతూ, “విడా V1 భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా ఎదుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయడానికి ఎదురుచూస్తున్నాను. భవిష్యత్తులో ఇది ఒక ముఖ్యమైన ఉత్ప‌త్తిగా మారడానికి సిద్ధంగా ఉంది. Hero MotoCorp ఇప్పటికే తన EV స్కూటర్ VIDA ఉనికిని మూడు నుంచి 100 నగరాలకు విస్తరించింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *