Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Spread the love

Solar Rooftop Yojana 2024 :  మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం 2024 (Free Solar Rooftop Scheme 2024 ) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో విద్యుత్‌ను అందించడం సాధ్యం కాదు, అందువల్ల సౌరశక్తి ద్వారా మీరు విద్యుత్‌ను పొందవచ్చు. మీరు మీ కరెంటు బిల్లలను తగ్గించుకోవమే కాకుండా మీ విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ఎనర్జీతో తీర్చుకోవచ్చు

ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకంలో మీరు ప్రభుత్వ సబ్సిడితో తక్కువ డబ్బు చెల్లించి సోలార్ ప్యానెల్స్ ను మీ ఇంటిపై ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.. ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం కింద, మీ ఇల్లు లేదా మీ ఆఫీసు పైకప్పుపై సోలార్ ప్లేట్‌లను అమర్చవచ్చు. విద్యుత్ ఖర్చులను వదిలించుకోవచ్చు.  అయితే  ఉచిత సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ 2024 కు అర్హత, నిబంధనలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఎలా లాగిన్ చేయాలి? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ సోలార్ రూఫ్‌టాప్ యోజన 2024

Government Solar Rooftop Yojana 2024 పథకాన్ని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద,  బలహీన వర్గాల ప్రజల ఇండ్లపై సోలార్ సిస్టం ను ఏర్పాటు చేస్తారు.   ఈ పథకం ద్వారా ఒక కోటి కుటుంబాలకు సౌరశక్తిని అందించనున్నారు. ఈ సోలార్ సిస్టం ద్వారా తమ ఇంటి అవసరాలకు విద్యుత్ ను పొందవవచ్చు అలాగే మిగులు విద్యుత్ ను డిస్కంలకు విక్రయించుకొని డబ్బులను సంపాదించుకోవచ్చు.

ఉచిత సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్‌కు అర్హత

సోలార్ రూఫ్‌టాప్ యోజన 2024 ఉచిత సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందేందుకు భారత ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది, నిబంధనలను అనుసరించే వ్యక్తికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది.
దీని ప్రకారం, అర్హత ఉన్న వ్యక్తి భారతదేశానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. మీ పేరుపై ఇల్లు ఉండాలని భారత ప్రభుత్వం పేర్కొంది. అలాగే కుటుంబంలోని ఏ సభ్యునికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్నును డిపాజిట్ చేసి ఉండొద్దు.  ప్రభుత్వం ఇచ్చిన అన్ని షరతులు మరియు నిబంధనలను అనుసరించే దరఖాస్తుదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు.

సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీ స్కీమ్ 2024 నుండి సోలార్ ప్యానెల్‌లను సెటప్ చేయడానికి, దేశంలోని అర్హులైన ప్రజలు  ప్రభుత్వ అధికారిక పోర్టల్‌ ను  సంప్రదించి  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సోలార్ రూఫ్‌టాప్ కాలిక్యులేటర్

సోలార్ రూఫ్‌టాప్ యోజన ద్వారా సోలార్ ప్యానెల్‌లను తీసుకోవాలనుకుంటున్న దరఖాస్తుదారులు తమకు  కావాల్సిన సోలార్ ఎనర్జీ కెపాసిటీ, ఎంత ఖర్చు వస్తుంది? సబ్సిడీ ఎంత.?  సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే నెలకు, ఏడాదికి ఎంతో డబ్బులు ఆదా చేయవచ్చో అనే వివరాలు ఈ Solar Rooftop Calculator ద్వారా తెలుస్తాయి.  సోలార్ రూఫ్‌టాప్ కాలిక్యులేటర్ కింది వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

రూఫ్‌టాప్ సోలార్ కోసం నేషనల్ పోర్టల్‌ https://solarrooftop.gov.in/ సందర్శించండి  

  • ఇప్పుడు హోమ్ పేజీలో ఉండే కాలిక్యులేటర్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత, సోలార్ రూఫ్‌టాప్ కాలిక్యులేటర్ స్క్రీన్‌పై  కనిపిస్తుంది.
    మీ వివరాలను నమోదు చేసి, calculate  అనే ఆప్షన్ ను క్లిక్ చేయడి
    సోలార్ రూఫ్‌టాప్‌కు సంబంధించిన మొత్తం సమాచారం డిస్‌ప్లే స్క్రీన్‌పై ఓపెన్ అవుతాయి.

ఉచిత సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ తో ప్రయోజనాలు

సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌ను సెటప్ చేయడానికి, 1-కిలోవాట్ సోలార్ సిస్టం ఇన్ స్టలేషన్ కోసం కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణం అవసరం.
ఈ పథకం కింద, ప్రభుత్వం 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెల్స్‌లో పెట్టడానికి 40% సబ్సిడీని అందిస్తుంది.
అదనంగా, 4 కిలోవాట్‌ల నుండి 10 కిలోవాట్‌ల వరకు సోలార్ ప్యానెల్స్‌ ఇన్ స్టాలేషన్ కోసం  20%  సబ్సిడీ ఇస్తుంది.
పరిశ్రమలు,  భారీ కర్మాగారాల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పవర్ బిల్లులను  30% నుండి 50% వరకు తగ్గించవచ్చు.

సోలార్ ప్యానెల్‌లు 25 సంవత్సరాల లైఫ్ టైం ను కలిగి ఉంటాయి. అంటే 25 ఏళ్ల పాటు ఉచితంగా కరెంటు ను అందిస్తాయి.  సోలార్ సిస్టం ఏర్పాటుకు పెట్టిన పెట్టుబడి  5-6 సంవత్సరాలలో తిరిగి పొందవచ్చు. ఆ తర్వాత, మీరు  20 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ ను పొందగలుగుతారు.

సౌరశక్తి వినియోగాన్ని పెంచడమే ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రధాన లక్ష్యం. సోలార్ వినియోగాన్ని పెంచడం ద్వారా బొగ్గుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌పై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.
సోలార్ రూఫ్‌టాప్ పథకం కింద సోలార్ ప్లేట్‌లను అమర్చవచ్చు. ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్‌ను విద్యుత్ శాఖకు పంపవచ్చు, బదులుగా విద్యుత్ సంస్థ మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తుంది.

 ఏయే డాక్యుమెంట్స్ అవసరం?

Required Documents for Solar Rooftop Yojana Registration సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం  ఆసక్తి గలవారు  అవసరమైన కీలకమైన పత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • ఆధార్ కార్డు,
  • పాన్ కార్డ్
  • అడ్రస్ ప్రూఫ్ / గుర్తింపు కార్డు
  •  రేషన్ కార్డు
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ పాస్ బుక్
  • మొబైల్ నంబర్
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • కరెంటు బిల్లు

Solar Rooftop Yojana 2024 దరఖాస్తు విధానం

Apply for a Free Solar Rooftop Scheme 2024 సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీ స్కీమ్ 2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు.  అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఉచిత సోలార్ రూఫ్‌టాప్ యోజన కోసం ప్రజలు తమ ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి పూర్తి చేయాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి

  • https://solarrooftop.gov.in/ లో రూఫ్‌టాప్ సోలార్ కోసం నేషనల్ పోర్టల్‌ని సందర్శించండి
  • హోమ్‌పేజీలో, “Apply for Rooftop Solar” పై క్లిక్ చేయాలి.
  • మీ దేశం పేరు, పంపిణీ వ్యాపార సంస్థ/అప్లికేషన్,  ఖాతా నంబర్‌తో పాటు అవసరమైన వివరాలను నమోదు చేయండి. అప్పుడు, “Next” బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఇచ్చిన QR కోడ్‌లను ఉపయోగించి రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ కోసం నమోదు చేసుకోవడానికి SANDES యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మరియు Sandes యాప్ ద్వారా OTPని అభ్యర్థించండి. స్వీకరించిన తర్వాత, సోలార్ రూఫ్‌టాప్ యోజన కోసం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడానికి OTP,    మీ ఇ-మెయిల్ IDని నమోదు చేయండి.
  • చివరగా, మీ రిజిస్టర్డ్  కస్టమర్ ఖాతా నంబర్, రిజిస్టర్డ్  మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
  •  నేషనల్ సోలార్ రూఫ్‌టాప్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి “Login” బటన్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ అవుతారు. దీని తర్వాత.. సోలార్ రూఫ్ స్కీమ్ కోసం దరఖాస్తు ఫారమ్ కనిపించే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    ఈ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • అందులో అడిగిన  సమాచారాన్ని పూరించిన తర్వాత, మీ పత్రాలు డిపార్ట్‌మెంట్ ద్వారా ధృవీకరించబడతాయి.
  • మీ దరఖాస్తును అధికారులు ఆమోదించినట్లైతే..  కొన్ని రోజుల తర్వాత మీ ఇంటికి సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ఒక బృందం వస్తుంది
  •  మీ ఇంటిని లేదా మీరు పేర్కొన్న ప్రదేశాన్ని తనిఖీ చేస్తుంది.
  • వారు అన్నీ సరిగ్గా ఉన్నాయని ధృవీకరణ తర్వాత, మీ సోలార్ ప్లేట్ ఇన్‌స్టాల్ చేస్తారు.  మీ సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *