బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ..
ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
“ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్” ప్రోగ్రామ్ కింద , కస్టమర్‌లు మొత్తం రూ. 24,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 6,500 వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయి.. చొరవలో భాగంగా రూ. 5,000 మరియు కార్పొరేట్ ఆఫర్ ప్రయోజనాలలో అదనంగా రూ. 1,500 ఉన్నాయి. Ather కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు అయిన ఏథర్ 450X , ఏథర్ 450S లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
ఏథర్ స్కూటర్లపై EMI ఆఫర్లు
Ather Energy కొనుగోలుదారులకు ఆర్థికపరంగా వెసులుబాటు కలిగించేందుకు Ather సంవత్సరానికి 5.99% వడ్డీ రేటు ఫైనాన్సింగ్ ప్లాన్‌ను అందిస్తోంది. EMI వడ్డీలపై రూ. 12,000 వరకు పొదుపు చేయవచ్చు. ఈ ఫైనాన్సింగ్ సొల్యూషన్, జీరో డౌన్ పేమెంట్, 60-నెలల EMI కాలపరిమితి వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు Ather 450X, 450S మోడల్‌ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది.
అదనపు బోనస్‌గా, ఈ ఆఫర్‌లను పొందే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 7,000 విలువైన అథర్ బ్యాటరీ ప్రొటెక్ట్ ప్యాకేజీని అందుకుంటారు. ఈ సమగ్ర ప్యాకేజీ బ్యాటరీపై 5-సంవత్సరాలు లేదా 60,000 కి.మీ వారెంటీని కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీ రక్షణకు భరోసా ఇస్తుంది. ముఖ్యంగా ఇది పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 70% స్టేట్-ఆఫ్-హెల్త్ (SoH) గ్యారెంటీని కలిగి ఉంది. కస్టమర్లు తమ స్కూటర్ బ్యాటరీపై ధీమాగా ఉండే అవకాశం లభిస్తుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.