Ola E-Scooter విడుదల తేదీ ఖరారు..
ఆగస్టు 15న విడుదలఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న Ola E-Scooter విడుదలయ్యే తేదీ ఎట్టకేలకు ఖరారయ్యింది. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ హై-స్పీడ్ స్కూటర్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ ఆగష్టు 15 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో భావిష్ అగర్వాల్ ప్రకటించారు.
రికార్డ్ స్థాయిలో బుకింగ్స్..
Ola E-Scooterను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15 న ఓలా స్కూటర్ కోసం ప్రారంబోత్సవ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ స్కూటర్, విడుదల తేదీలతోపాటు స్కూటర్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లను వెల్లడించనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.జూలైలోనే ఓలా కంపెనీ ఈ-స్కూటర్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. కానీ దాని స్పెసిఫికేషన్‌లు మరియు ధరల గురించి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. గత నెలలో స్కూటర్ మొదటి 24 గంటల్లో 1 లక్ష...