Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

Spread the love

Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్  పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air,  Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు మార్కెట్ లో గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఈ మూడు Electric scooters స్పెసిఫికేషన్లు, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతక్ అర్బేన్ Vs S1 ఎయిర్ Vs ఏథర్ 450S: పవర్‌ట్రెయిన్

చేతక్ 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇది సింగిల్ చార్జిపై 113 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఓలా S1 ఎయిర్ 3kWh బ్యాటరీ కలిగి ఉంది. ఇది 151 కిమీ రేంజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తుంది. ఇక ఏథర్ 450S 2.9kWh బ్యాటరీ యూనిట్ తో ఒకే ఛార్జ్‌పై 115 కిమీ వరకు వెళ్లగలదు. బజాజ్ చేతక్ అర్బేన్.. మోటార్ స్పెసిఫికేషన్‌ను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది దాని ప్రామాణిక రూపంలో 63 kmph, TecPacతో 73 kmph గరిష్ట వేగాన్ని అందుకోగలదని తెలుస్తోంది.

బజాజ్ ప్రత్యర్థులైన Ola  S1 Air,  Ather 450Sతో పోల్చితే ఇది చాలా స్లోగా ఉంటుంది. ఇవి రెండూ 90 kmph అత్యధిక వేగంతో ఉంటాయి.

ఇంజిన్ స్పెక్స్Bajaj Chetak UrbaneOla S1 AirAther 450S
బ్యాటరీ2.9kWh లిథియం అయాన్3.0kWh లిథియం అయాన్2.9kWh లిథియం అయాన్
రేంజ్113 కి.మీ151 కి.మీ115 కి.మీ
టాప్ స్పీడ్63 kmph (ప్రామాణికం)73 kmph (TecPac)90 కి.మీ90 కి.మీ
పీక్ పవర్NA6kW5.4kW
మోటార్ రకంహబ్ మోటార్PMSM
రైడింగ్ మోడ్‌లుఎకో (ప్రామాణిక) ఎకో, స్పోర్ట్స్ (TecPac)ఎకో, నార్మల్, స్పోర్ట్స్పోర్ట్, రైడ్, ఎకో, స్మార్ట్ ఎకో1
బ్యాటరీ ఛార్జింగ్ సమయం (గంటలు)4 గం 50 నిమిషాలు58.3

Chetak Urbane Vs S1 Air Vs 450S : ఫీచర్లు

చేతక్ అర్బేన్ ప్రీమియం వేరియంట్ వలె దాని డిజిటల్ LCD డివైజ్ ను కలిగి ఉంటుంది.  అర్బన్ ట్రిమ్ మరే ఇతర ఫీచర్లను పొందదు. కానీ TecPacని ఎంచుకోవడం ద్వారా ఇది హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, ట్యాంపర్ అలర్ట్‌లు, OTA అప్‌డేట్‌లు మొదలైనవాటిని అందించే పూర్తి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ప్యాకేజీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇక ఓలా S1 ఎయిర్ మరియు 450S నావిగేషన్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో మెరుగ్గా అమర్చబడి ఉన్నాయి.

Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S: ధర

చేతక్ అర్బన్ Electric scooter స్టాండర్డ్ రూపంలో ఎక్స్ షోరూం ధర రూ. 1.15 లక్షలు కాగా, టెక్‌పాక్‌తో రూ. 1.21 లక్షలు కలిగి ఉంటుంది. ఓలా S1 ఎయిర్‌ను రూ. 1.20 లక్షలకు అందిస్తోంది. కాగా ఏథర్ 450ఎస్ ధర రూ. 1.29 లక్షలతో వస్తుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *