Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Environment

ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

Environment
Delhi Air Improvement - 2025 : జూలై 2025లో ఢిల్లీ 2018 తర్వాత అత్యంత స్వచ్ఛమైన జూలై గాలి నాణ్య‌త‌ను నమోదు చేసింది. సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 78గా ఉంది. ఇది 'సంతృప్తికరమైన' విభాగంలోకి వ‌స్తుంది. ఈ ఘనత 2020 సంవత్సరంలో COVID-19 లాక్‌డౌన్ సమయంలో నమోదైన గాలిని కూడా అధిగమించింది. ఇది వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నగరం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్ప‌వ‌చ్చు.జూలైలో అత్యుత్తమ AQI: పురోగతి వివరాలు..జూలై 2025కి సగటు AQI 78గా ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాల కంటే భారీ మెరుగుదల మాత్రమే కాదు, 2020 లాక్‌డౌన్ సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంది. గ‌తంలో జులైల‌లో చాలా దారుణమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి: 104 (2018), 134 (2019), 84 (2020), 110 (2021), 87 (2022), 84 (2023), మరియు 96 (2024).ఇంకా, జూలై 2025 ఈ నెలలో అత్యధికంగా 29 రోజులు 'సంతృప్తికరమైన' ఎయిర్ డేలను చూసింది, 2018లో 16 మరియు ...
కేరళలో ఈ-వ్యర్థాల సేకరణకు  స్పెషల్ డ్రైవ్  – e-Waste Collection

కేరళలో ఈ-వ్యర్థాల సేకరణకు స్పెషల్ డ్రైవ్ – e-Waste Collection

Environment
తిరువనంతపురం: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (e-Waste Collection) సురక్షితంగా పారవేయడానికి కేరళ ప్రభుత్వం సరికొత్త చొరవను ప్రారంభించింది. ఇందులో మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ వేస్టేజ్ కలెక్షన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తోంది. గృహాలు, సంస్థలు పారవేసే గాడ్జెట్‌లు ఉపకరణాలకు LSGD ప్రత్యేక ధరను నిర్ణయించింది.మంగళవారం నెయ్యటింకర మునిసిపాలిటీలో జరిగే కార్యక్రమంలో స్థానిక స్వపరిపాలన శాఖ (LSGD) మంత్రి MB రాజేష్ మునిసిపాలిటీలలో ప్రారంభించనున్న ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన మొదటి దశను ప్రారంభించారు.రాష్ట్రంలో విషపూరిత కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు, ఈ-వ్యర్థాలను పౌరులకు బహుమతిగా మార్చేందుకు ప్రభుత్వం ఈ స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించింది. హరిత కర్మ సేన సభ్యుల ద్వారా సేకరణ డ్రైవ్ నిర్వహిస్తోంది. క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ ఈ ప్రయత్నాలను సమన్వయం చేస్తుంది.ఈ-వ్యర్థాల సేకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా...
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

Environment, General News
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజ‌ధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేపట్టింది.కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ పంపులు వీటికి ఇంధనాన్ని అందించవు:10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలునివేదికల ప్రకారం, ఢిల్లీ (New Delhi)లో వాహ‌నం చెల్లుబాటు అయిపోయిన (EOL) వాహనాలపై ఇంధన నిషేధం అమలును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) నవంబర్ 1 వరకు నిలిపివేసింది. ఈ విధానాన్ని అమలు చేయడంలో కార్యాచరణ గురించి ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం ...
 sustainable Kumbh Mela 2025 |  మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు ప‌రిష్కారాలు ఎలా?

 sustainable Kumbh Mela 2025 | మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు ప‌రిష్కారాలు ఎలా?

Environment
 sustainable Kumbh Mela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్స‌వాల్లో ఒకటైన కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జిల్లా ప్రయాగ్‌రాజ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేళా సమయంలో నదులలో ల‌క్షలాది మంది భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తారు. ఇది మ‌న పాపాలను తొల‌గిస్తుంద‌ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేస్తుందని విశ్వ‌సిస్తారు.కుంభమేళా (Kumbh Mela 2025 ) ప్రాముఖ్యతకుంభమేళా భార‌తీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, పవిత్ర జలాల్లో పుణ్య‌స్నానాలు, గంగా హార‌తుల కోసం లక్షలాది మంది భక్తులు త‌ర‌లివ‌స్తారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాలు, ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శోభాయాత్ర‌లు, భారతదేశం స‌నాత‌న ధ‌ర్మం గొప్పత‌నాన్ని చాటుతుంది.కుంభమేళా ఒక స్మారక ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే, దాని పెద...
Delhi air pollution Today |

Delhi air pollution Today |

Environment
Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్‌లో అంచనా వేసింది.అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి 7 గంటలకు 457కి దిగజారడంతో, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP స్టేజ్ IV విధించింది. రాత్రి 10 గంటల సమయానికి, రాజధానిలోని అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌లు, AQI రీడింగ్‌లు 400 కంటే ఎక్కువ ఉండటంతో తీవ్రమైన కాలుష్య స్థాయిలు కొనసాగినట్లు నివేదించాయి.గాలి నాణ్యతను మరింత దిగజారుతున్న తరుణంలో సోమవారం ఉదయం ఢిల్లీలో పబ్లిక్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసింది. అలాగే మరిన్ని కఠినమైన కాలుష్య ని...
Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Environment
Delhi air pollution : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు క‌మ్ముకుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కఠినమైన కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయాల‌ని సూచించింది. CAQM తీవ్రమైన పొగమంచును "ఎపిసోడిక్ ఈవెంట్"గా వర్గీకరించింది.ఢిల్లీలోని ఆనంద్ విహార్ (441), ద్వారక (444), ముండ్కా (449), ఆర్‌కె పురం (437), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (446) వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ‘సివియ‌ర్‌’ జోన్‌లో కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ గణాంకాలు ప్రచురించాయి.AQI 401-450 ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నప్పుడు స్టేజ్‌ III చర్యలు వర్తిస్తాయి. I మరియు II స్టేజ్‌ల కింద ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధ‌న‌ల‌కు అద‌నంగా కాలుష్య నిరోధక చర్యలను చేప‌ట్ట‌నున్నారు. GRAP గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తుంది: స్టేజ్ I (AQI 201-300) “...
Stubble Burning : వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేస్తున్నారా? అయితే రూ.30,000 జ‌రిమానా చెల్లించాల్సిందే..

Stubble Burning : వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేస్తున్నారా? అయితే రూ.30,000 జ‌రిమానా చెల్లించాల్సిందే..

Environment
Stubble Burning Penalties : ఢిల్లీలో విప‌రీతంగా వాయు కాలుష్యం (Air Pollution) పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణించ‌డంతో కేంద్రం క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. వ్య‌వ‌సాయ వ్య‌ర్థాలు తగులబెట్టినందుకు జరిమానాలను భారీగా పెంచింది, ఇప్పుడు జరిమానా రూ. 30,000కి చేరుకుంది. వ్యవసాయ అవశేషాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి సవరించిన నిబంధనల ప్రకారం, తక్షణమే అమలులోకి వస్తుంది. వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా జరిమానాలను వర్గీకరించింది.రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు రూ.5,000 జరిమానా విధిస్తారు.రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి రూ.10,000 జరిమానా విధిస్తారు.ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు రూ. 30,000 జరిమానా విధిస్తారు.దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi ) పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం ( వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల ద‌హ‌నంపై చ‌ర్య‌ల‌కు సంబంధించి ) కేంద్రం కొత్త నియ‌మా...
Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన‌ది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..

Environment
Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెర‌పైకి వచ్చింది. ఇది పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన‌ నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘ‌న‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్‌ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన‌ పరిమితి కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్క‌డ కాలుష్యం విప‌రీతంగా పెర‌గ‌డంతో పాకిస్తాన్ ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం, వ‌ర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేయడం వంటి అత్యవసర చర్యలకు ఉప‌క్ర‌మించింది.ప్రాణాంతక PM2.5 కాలుష్య కారకాల స్థాయి -- ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే గాలిలోని సూక్ష్మ కణాల స్థాయి 610కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 15 పరిమితి కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంది.లాహోర్‌లో, నగరవాసులు ఇంటి లోపలే ఉండాలని,...
Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..

Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..

Environment
Indore Plantation Drive : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన న‌గ‌రం ఇండోర్ లో ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి స‌రికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇండోర్-ఉజ్జయిని రోడ్డులో ఉన్న రేవతి రేంజ్ హిల్ (Revati Range hillock ) పై మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో ఇండోర్‌కు చెందిన 40 మందికి పైగా ప్రవాస భారతీయులు (NRIలు) తో పాటు సహా 30,000 మందికి పైగా పాల్గొన్నారు.ఇండోర్ ప్రజలతో కలిసి కేంద్ర‌ హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కూడా మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కింద ఒక మొక్కను నాటారు. మొక్క‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద‌ర్భంగా జూలై 5న ప్ర‌ధాని మోదీ 'ఏక్ పెద్ మా కే నామ్స‌. మొక్క‌లు నాటిన విష‌యం తెలిసిందే.. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో 5.5 కోట్లతో సహా దేశవ్యాప్తంగా 140 కోట్ల చెట్లను నాటనున్నారు. ఇందులో భాగంగానే ఇండోర్‌లో భారీ ప్లాంటేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించారు.బోర్డ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు