
Chetak vs Rizta | కొత్త బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టాలో ఏది బెస్ట్?
Bajaj Chetak 3501 vs Ather Rizta comparison | బజాజ్ ఆటో ఇటీవలే కొత్త తరం చేతక్ 35 సిరీస్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మరో అడుగు వేసింది. అనేక కొత్త అప్‌డేట్‌లు కీలక మార్పులతో కొత్త బజాజ్ చేతక్ ఈవీ వచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన ఏథర్ రిజ్టా తో ఫ్లాగ్‌షిప్ చేతక్ 3501 మధ్య తేడాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం.Bajaj Chetak 3501 vs Ather Rizta : స్పెసిఫికేషన్‌లు2025 బజాజ్ చేతక్ ను కొత్త ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇందులోని పెద్దదైన 3.5 kWh బ్యాటరీ ఇప్పుడు ఫ్లోర్‌బోర్డ్ కిందకు మార్చారు. ఇది 5.3 bhp పవర్ అవుట్‌పుట్, 73 kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తి ఛార్జ్‌తో చేతక్ 153 కిమీల రేంజ్ ను అందిస్తుందని బజాజ్ పేర్కొంది, దాని కొత్త 950W ఆన్‌బోర్డ్ క్విక్ ఛార్జర్‌తో ఇది కేవలం మూడు గంటల్లో 0-80 శాతం వరకు చార్జ్...