
Bounce Infinity electric scooter వస్తోంది..
బ్యాటరీ లేకుండానే బండిBounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. పూర్తిగా ఇండియాలోనే తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity ) అని పిలుస్తారు. దీని కోసం త్వరలో అధికారికంగా ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జనవరి 2022 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది.ఈవీలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బౌన్స్ సంస్థ దాని ప్రత్యర్థుల నుండి కాస్త డిఫరెంట్‌గా ఉండేలా ఈవీని అందించాలని యోచిస్తోంది. బౌన్స్ ఇన్ఫినిటీ స్మార్ట్, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. కస్టమర్లు తమ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, కంపెనీ ఒక ప్రత్యేకమైన ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వ...









