PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

Climate Resilient Seed Varieties
Spread the love

Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్ప‌త్తులను మెరుగుప‌రిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల‌ వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్త‌నాల‌ను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి.

ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాల‌లో జ‌రిగిన‌ ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విత్తనాలను ఆవిష్కరించారు, అక్కడ రైతులు, శాస్త్రవేత్తలతో ఆయ‌న చ‌ర్చించారు. క్షేత్ర పంట రకాలలో తృణధాన్యాలు, మినుములు, మేత పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి పంటలు ఉన్నాయి. హార్టికల్చర్ కోసం, ప్రధాని కొత్త రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలను విడుదల చేశారు.

కొత్త పద్ధతులు అన్వేషించాలి..

రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, వాతావరణ ప్ర‌తికూల పరిస్థితుల‌ను-తట్టుకునే పద్ధతుల ను అన్వేషించాల‌ని ప్రధాని మోదీ కోరారు. భారతదేశంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ సేవల వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు వాటిని అనుసంధానిస్తూ బయోఫోర్టిఫైడ్ పంట రకాలను ప్రోత్సహించాల‌ని ఆయన నొక్కి చెప్పారు.

అంతకుముందు, దేశ రాజధానిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 109 విత్తన రకాల (Climate Resilient Seed Varieties)ను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాటిలో 23 రకాల తృణధాన్యాలు, వరి తొమ్మిది, గోధుమలు రెండు, బార్లీ ఒకటి, మొక్కజొన్న ఒకటి, జొన్న ఒకటి, మినుములు ఒకటి, రాగులు ఒకటి, చీనా ఒకటి, సాంబ ఒకటి, అర్హర్ రెండు ఉన్నాయి. మూడు కందులు, శనగలు ఒకటి, పచ్చిమిర్చి రెండు, నూనెగింజలు ఏడు అలాగే ప‌శుగ్రాసం, చెరకు ఒక్కొక్కటి పత్తి ఐదు, జనపనార ఒకటి, 40 రకాల ఉద్యానవన మొక్క‌లు ఉన్నాయ‌ని చౌహాన్ చెప్పారు.

ప్ర‌ధాని మోడీ మిల్లెట్ ప్రాముఖ్యతపై చర్చించారు. ప్రజలు పౌష్టికాహారం వైపు ఎలా పయనిస్తున్నారో నొక్కిచెప్పారు. సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు, సేంద్రియ వ్యవసాయం పట్ల సామాన్యులకు పెరుగుతున్న విశ్వాసం గురించి కూడా ఆయన మాట్లాడారు, ప్రజలు సేంద్రీయ ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులు అభినందించారు.

వ్యవసాయ మంత్రిత్వ శాఖపై కుమారస్వామి స్పందన

వ్యవసాయ మంత్రిత్వ శాఖపై కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ తనకు ఇస్తారని తాను భావిస్తున్నానని, అయితే, శివరాజ్ సింగ్ చౌహాన్ “మెరుగైన పని” చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. త‌న‌కు అగ్రికల్చర్ పోర్ట్‌ఫోలియో ఇస్తారని ఊహించాన‌ని, మన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. అలాగే రైతుల సమస్యలు తెలుసుకుని మరింత మెరుగైన పని చేస్తారు అని విశ్వాసం వ్యక్తం చేశారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *