Home » Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహ‌కాలు..
Electric vehicle adoption

Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహ‌కాలు..

Spread the love

Electric vehicle adoption | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) స్వీకరణను వేగవంతం చేయడానికి, అలాగే దేశీయంగా ఈవీల‌ తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 1.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీక‌ర‌ణ కూడా పెరుగుతోంది. e-2W అమ్మకాలు FY24లో 17,52,406 యూనిట్లకు పెరిగాయి.

JMK రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ తాజా నివేదిక ప్రకారం.. దేశంలో పెద్ద సంఖ్య‌లో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇది మొత్తం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మకాలలో ఇవే 94 శాతం ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 13న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS 2024), దేశవ్యాప్తంగా EVల స్వీకరణను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి మొత్తం రూ. 500 కోట్లతో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అమలు చేయాల‌ని భావించారు. అయితే ఇప్పుడు మరో రెండు నెలలు పాటు ఈ పథకాన్ని పొడిగించారు. ఇప్పుడు, EMPS పథకం సెప్టెంబరు 30 వరకు అమలులో ఉంటుంది. ఈ ప‌థ‌కం కోసం కేంద్రం రూ.778 కోట్లు వెచ్చించింది. . దేశంలో EV తయారీ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడం ఈ పథకం ప్ర‌ధాన ఉద్దేశం.

5.60 ల‌క్ష‌ల ఈవీల‌కు స‌బ్సిడీ

మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పథకం ప్రధానంగా ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ ( e-2W), ఎల‌క్ట్రిక్ త్రీ వీల‌ర్స్‌( e-3W) లకు వర్తిస్తుంది. ఇవి వాణిజ్యపరమైన ఉపయోగంతో పాటు, ప్రైవేట్‌గా లేదా కార్పొరేట్ యాజమాన్యంలోని నమోదిత e-2W కూడా పథకం కింద అర్హత పొందుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం ఇప్పుడు 500,080 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (e-2Ws), 60,709 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (e-3Ws)తో మొత్తం 560,789 ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) స‌బ్సిడీ ఇవ్వ‌నుంది. ఈ పథకం దేశంలో ఈవీ ప‌రిశ్ర‌మ‌లో పోటీ తత్వంతోపాటు EV తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. తద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌ను ఊత‌మిస్తుంది.

ప్రపంచ EV తయారీదారుల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, భారతదేశాన్ని ఇ-వాహనాల త‌యారీ హ‌బ్ గా తీర్చ‌దిద్దాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. తాజా CareEdge రేటింగ్స్ నివేదిక ప్రకారం, దేశంలో ఎలక్ట్రిక్ కార్ల (Electric vehicle adoption ) వ్యాప్తి స్థిరంగా పెరుగుతోంది. ఇది మరింత స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన సమర్థవంతమైన రవాణా రంగం వైపు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స‌ఫ‌ల‌మ‌వుతున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ మొబిలిటీకి మార్పు అనేది కార్లు, ట్రక్కులకు మించి విస్తరించింది. ఇ-రిక్షాలు ఇ-కార్ట్‌లకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ ల‌భిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు 85 శాతం వృద్ధితో 3,708 యూనిట్లకు పెరిగాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి.. కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ
ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి.. కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ