FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోందని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొదటి, రెండు దశల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, తయారీని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024 అమలవుతోంది. దీని గడువు సెప్టెంబర్‌లో ముగుస్తుంది. మొత్తం రూ. 500 కోట్లతో EMPS పథకం నాలుగు నెలల పాటు చెల్లుబాటులో ఉంది. ఆ తర్వాత మరో రెండు నెలలు పొడిగించారు. అయితే దీని స్థానంలో FAME 3 scheme ను ప్రారంభించనున్నారు.
ఫేమ్ 2 లో భారీగా సబ్సిడీలు..
FAME రెండవ దశ 2019లో మూడు సంవత్సరాలకు గాను రూ.10,000 కోట్ల ప్రారంభ వ్యయంతో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత రూ. 1,500 కోట్ల అదనపు వ్యయంతో మార్చి 2024 వరకు పొడిగించింది. ఈ పథకంలో భాగంగా 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 55,000 ప్యాసింజర్ కార్లు, 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
అయితే “FAME 3లో, అనేక సూచనలు వస్తున్నాయి ఎందుకంటే FAME 1, FAME 2లో ఉన్న లోపాలను ఎలా అధిగమించాలనే దానిపై కోసం సమీక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. PMO కూడా… మా అంతర్ మంత్రిత్వ బృందం కొన్ని సూచనలు ఇచ్చిందని చెప్పారు.
FAME 3 Scheme కోసం టైమ్‌లైన్ గురించి మీడియా ప్రశ్నించగా “నేను ఒకటి రెండు నెలల్లో క్లియర్ చేయాలనుకుంటున్నాను” అని మంత్రి బదులిచ్చారు. FAME 3 ప్రతిపాదన ఒకటి లేదా రెండు నెలల్లో ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గానికి పంపబడుతుందా అనే దానిపై మంత్రి స్పందిస్తూ.. “ఇప్పుడు కూడా అనేక సూచనలు వస్తున్నాయి, మేము అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.. ఏది ఉత్తమమైనదో గుర్తించే పనిలో ఉన్నాము. అని తెలిపారు.
అనేక కొత్త-తరం OEMలు, ముఖ్యంగా ద్విచక్ర వాహన సంస్థలు, పరిశ్రమలు సబ్సిడీల కొనసాగింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పథకం కింద ఇచ్చిన డిమాండ్ సబ్సిడీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో కీలక పాత్ర పోషించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
[…] FAME 3 Scheme | త్వరలో అమలులోకి FAME 3 స్కీమ్.. ఎ… […]