Harithamithra Telugu News

Home Agricultue ఉద్యాన పంటలు Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

0
Oil Palm Factory

సాంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొత్త కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కీలక అంశాలు:

  • ఆయిల్ పామ్ సాగు (Oil Palm Farming)పై నొక్కి: రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. ఈ పంట సాగు చేసే రైతులకు నాలుగేళ్ల పాటు ₹51,000 సబ్సిడీ అందజేస్తామన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు సాగు చేసుకోవచ్చని, దీనివల్ల అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.
  • యాంత్రీకరణకు నిధులు: గత పదేళ్లలో వ్యవసాయ యాంత్రీకరణ నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుత ప్రభుత్వం దీనికి భారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలో రైతులే స్వయంగా సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
  • మే నెలలో కొత్త ఫ్యాక్టరీ: ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మే నెలలో ప్రారంభించనున్నట్లు, అలాగే జిల్లాలో ఆయిల్ పామ్ నర్సరీ ఏర్పాటుకు గోద్రేజ్ సంస్థ ఆసక్తి చూపుతోందని తెలిపారు.
  • ఆర్గానిక్ ఫార్మింగ్:
  • జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాబోయే రోజులలో ఆహార భద్రత చాలా కీలక అంశంగా మారనుందని, పెరుగుతున్న జనాభా, భూసారం తగ్గడం వంటి సమస్యలు కీలకం కానున్నాయని అన్నారు. వ్యవసాయం సరైన పరిజ్ఞానంతో చేయగలిగితే ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు యూరియా వాడకం వీలైనంత వరకు తగ్గించాలన్నారు.

మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్వయంగా రైతేనని, ఆయన పంట పొలాలలో యూరియా వినియోగించడం జరగదని, ఆర్గానిక్ ఫార్మింగ్‌తో మంచి లాభాలు ఉంటాయని అన్నారు. రసాయనాలతో పండించిన పంటలు తినడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మనం తినే ఆహారం కలుషితం కావద్దని, నేడు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి వచ్చిన మేధావులు వచ్చారని, రైతులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.

Previous article₹13,000 కోట్లతో ‘మష్రూమ్ మిషన్’! (MushroomMission)
Next articleకేంద్ర మోటార్ వాహనాల నిబంధనల్లో భారీ మార్పులు: ఇథనాల్, హైడ్రోజన్, బయోడీజిల్‌కు ప్రాధాన్యం
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here