Home » Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus vs competition
Spread the love

Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది.

కొత్త వ‌చ్చిన హీరో Vida V1 ప్లస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇప్ప‌టికే మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన‌, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీప‌డ‌నుంది. కొత్త Hero Vida V1మిగ‌తా వాటితోఉన్న పోలిక‌లు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూట‌ర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్‌, పవ‌ర్‌ట్రేన్ వివ‌రాల‌ను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు.

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

Hero Vida V1  తో మిగతా స్కూటర్లతో పోలికలు

Hero Vida V1 Plus vs competition : ఈవీసెగ్మెంట్‌లోని అన్ని స్కూటర్‌లు – హీరో విడా వి1 ప్లస్, ఏథర్ 450ఎస్, ఓలా ఎస్1 ఎయిర్, టివిఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ – వాటి ఫ్లాగ్‌షిప్ కౌంటర్‌పార్ట్‌లలో కాస్త త‌క్కువ ధ‌ర‌ల్లో ల‌భించే వేరియంట్లు. వీటిల్లో చిన్న బ్యాటరీ ప్యాక్, కాస్త త‌క్కువ యాక్సిల‌రేష‌న్, ఫుల్ చార్జిపై స‌రాస‌రి 100కిమీల రేంజ్ ని ఇస్తాయి.

స్పెసిఫికేషన్లువిడా V1450SS1 ఎయిర్iQubeచేతక్
బ్యాటరీ ప్యాక్3.4kWh2.9kWh3 kWh3kWh2.8kWh
రేంజ్100 కి.మీ90 కి.మీ151 కి.మీ100 కి.మీ113 కి.మీ
0-403.4 సె3.9 సె3.3 సె4.2 సె-
టాప్ స్పీడ్80 కి.మీ90 కి.మీ90 కి.మీ78కి.మీ68కి.మీ
రీఛార్జ్ (0-80)65 నిమిషాలు6.3 గం5 గం4.3 గం4.3గం
ధరరూ.1.15 లక్షలురూ. 1.09 లక్షలురూ. 1.04 లక్షలురూ.1.34 లక్షలురూ.1.15 లక్షలు
READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ స్కూటర్లలో, TVS iQube అత్యంత ఖరీదైనది.  0 నుండి 40kmph వరకు స్పీడ్ ను అందుకోవడానికి  ఎక్కువ సమయం తీసుకుంటుంది.  అయితే బజాజ్ దీని యాక్సిలరేషన్ సమయాన్ని వెల్లడించలేదు. Vida 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది.  అయితే Ola S1 ఎయిర్ వేగవంతమైన  స్కూటర్. రేంజ్ కూడా ఎక్కువగానే ఇస్తుంది.  ఇక  Ather 450S,  Ola S1 ఎయిర్‌లు ఒకే టాప్ స్పీడ్‌ను కలిగి ఉండగా, చేతక్ అర్బేన్ వీటన్నింటి కంటే తక్కువ స్పీడ్ తో వెళ్తుంది.

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *