Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొద్దిరోజుల్లో మన ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూటర్ లోని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది.
యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగదారుల అసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అయితే ఈ రెండు మోడల్‌లు యాక్టివా పెట్రోల్ వేరియంట్ డిజైన్ తో పోల్చితే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. Active e, QC1 అవి ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి అనే దానిపై మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
హోండా యాక్టివా ఇ, QC1 — బ్యాటరీ ప్యాక్‌లు
రెండింటి మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఏమిటంటే స్కూటర్లలో పొందుపరిచిన బ్యాటరీ ప్యాక్‌లు. హోండా యాక్టివ్ e రెండు 1.5kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఇవి రిమూవబుల్ బ్యాటరీలు. సాంప్రదాయ స్కూటర్ లాగా రీఛార్జ్ చేయలేవు . హోమ్‌లో ఛార్జింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది. కంపెనీ తన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లలో బ్యాటరీలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జిపై 102కిమీ రేంజ్ అందిస్తుంది. ఈబ్యాటరీ సీటుకింద అమచ్చారు.
ఇక హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటిలో సంప్రదాయబద్ధంగా ఛార్జ్ చేయగల చిన్న 1.5kWh ఫిక్స్‌డ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. యాక్టీవా QC1మోడల్ హోండా 80km రేంజ్ ను క్లెయిమ్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ 0–100 శాతం నుంచి ఛార్జ్ చేయడానికి ఆరు గంటల యాభై నిమిషాలు పడుతుంది. QC1 రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం 50kmph. 9.4 సెకన్లలో 0-40kmph వేగాన్ని అందుకుంటుంది
హోండా యాక్టివా ఇ, QC1 ఫీచర్లు, హార్డ్‌వేర్
Honda Activa e మరియు QC1 హార్డ్‌వేర్ ఫీచర్లలో కొన్ని తేడాలను కలిగి ఉన్నాయి. యాక్టివా ఇ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు మోనోషాక్, ముందువైపు డిస్క్ బ్రేక్, కీలెస్ ఇగ్నిషన్, అల్లాయ్ వీల్స్, కనెక్టివిటీ ఆప్షన్‌లతో కూడిన TFT డాష్, మూడు రైడ్ మోడ్‌లతోపాటు రివర్స్ మోడ్‌లు ఉన్నాయి.
హోండా QC1 టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు మోనోషాక్, అల్లాయ్ వీల్స్, రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లు, ఒక LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో రివర్స్ మోడ్ లేదు. 26-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, ఐదు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. . హోండా Activa e, యాక్టీవా QC1 రెండూ LED లైటింగ్‌ను కలిగి ఉంటాయి.
Honda Activa QC1 — బుకింగ్‌లు, సేల్స్, డెలివరీలు
హోండా యాక్టివా ఇ బుకింగ్‌లు జనవరిలో ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్ హోండా ఏర్పాటు కారణంగా Activa e ప్రధానంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో మూడు నగరాల్లో విక్రయించనున్నారు. స్వాపింగ్ స్టేషన్లు సిద్ధమైన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.
హోండా QC1 సంప్రదాయబద్ధంగా ఛార్జ్ చేయబడవచ్చు కనుక ఇది పాన్- ఇండియాలో విక్రయించనున్నారు. . యాక్టివా ఇ మాదిరిగానే బుకింగ్‌లు జనవరిలో ప్రారంభమవుతాయి, ఫిబ్రవరిలో డెలివరీలు జరుగుతాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడానికి రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో (సాధారణ విక్రయ కేంద్రాలు) హోండా ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉంటుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..