భారతీయ రోడ్లపై దుమ్మురేపే కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. వీటి మైలేజీ, ధరలు ఇవే..

Spread the love

భారతీయ రోడ్లపై స్పోర్ట్స్ బైక్స్ ను తలదన్నేలా దుమ్మురేపే ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. తాజాగా గోవాకు చెందిన EV స్టార్టప్, కబిరా మొబిలిటీ (Kabria Mobility).. భారతదేశంలో అత్యాధునిక ఫీచర్లు కలిగిన రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి పేర్లు.. KM3000, KM4000. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ తో వస్తున్నాయి.  దీనిని ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు.

Kabria KM3000, KM4000 స్పెసిఫికేష‌న్స్‌,

Kabria KM3000 KM4000 Specifications : ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..  KM3000 పూర్తిగా ఫెయిర్డ్ మోటార్‌సైకిల్, అయితే KM4000 దీనికి భిన్నంగా స్టైలిష్ గా  ఉంటుంది. అవి రెండూ ఒకే డైమండ్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడి ఉంటాయి, అయితే స్వింగర్మ్ మోటార్‌సైకిళ్ల సబ్-వేరియంట్‌లను బట్టి స్టీల్ లేదా అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయారు చేశారు.

రెండు మోటార్‌సైకిళ్లలో షోవా తయారు చేసిన టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్ తో వస్తాయి. ముందు వెనుక డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల వీల్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్,  ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో కూడిన మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్స్ ఇందులో చూడొచ్చు.

రేంజ్, స్పీడ్..

బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే, మోటార్‌సైకిళ్లు 4.1kWh లేదా 5.15kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి.  ఇది స్టాండర్డ్ లేదా V వేరియంట్‌లను బట్టి – మళ్లీ సబ్-వేరియంట్‌లను బట్టి 178కిమీ లేదా 201కిమీ రేంజ్ ను అందిస్తుంది.  రెండు మోడల్‌లు గంటకు 120కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి.  అలగే  192Nm  క్లెయిమ్ టార్క్‌తో 2.9 సెకన్లలో 0 నుండి 40kmph వరకు వేగాన్ని అందుకోగలవు.  చేయగలవు.

Kabria KM3000, KM4000 ధర

Kabria KM3000 KM4000 Price : ఆసక్తిగల వారు కబీరా KM3000 KM4000 మార్క్-II మోడల్‌ లను ఎంపిక చేసిన ప్రదేశాల్లో  టెస్ట్ రైడ్‌లు చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.  కబీరా మొబిలిటీ  డీలర్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీలు మార్చి 2024లో ప్రారంభమవుతాయని తెలిపింది. కాగా ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ ల ధరలు  (ఎక్స్ షోరూం) రూ. 1.74 లక్షలు, రూ. 1.76 లక్షలుగా ఉంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..