ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Okinawa (ఒకినావా).. తాజాగా Okhi 90 హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( electric scooter )ను లాంచ్ చేసింది. తమ స్కూటర్లను¯కొత్త దిశలో తరలించేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం ఇది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్ట్ మోడ్‌లో 160కిమీ పరిధిని అందిస్తుంది. మరోవైపు ఈ స్కూటర్‌లో ఏకంగా 16-అంగుళాల చక్రాలు ఉండడం ప్రత్యేకత. ఈ స్కూటర్ ₹1.22 లక్షలకు అందుబాటులో ఉండనుంది. రాష్ట్రాల వారీగా సబ్సిడీలు అమల్లోకి వచ్చిన తర్వాత ధరలలో మార్పులు ఉంటాయి.
ఒకినావా ఓఖి 90 డిజైన్
చూడడానికి Okhi 90 ఒక సంప్రదాయ ICE పవర్డ్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో అసాధారణంగా 16-అంగుళాల చక్రాలను ఈ స్కూటర్‌లో వినియోగించారు. ఇది ఏప్రిలియా SR160 లేదా Yamaha Aerox 155 వంటి స్కూటర్‌ల మాదిరిగా కనిపిస్తుంది. ఇది ఎరుపు, నీలం, తెలుపు, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుంది. Okhi 90 electric scooter వెనుక భాగంలో LED DRLలు ఉన్నాయి, అలాగే Okinawa మొబైల్ యాప్‌కి కనెక్ట్ అయ్యే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొనగలిగే ఫీచర్లతో కలర్ డిజిటల్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది Ola S1 ప్రో యొక్క 36-లీటర్ల బూట్ స్పేస్ కంటే ఎక్కువగా అంటే క్లాస్-లీడింగ్ 40-లీటర్ల బూట్ స్పేస్‌ను ఇచ్చారు.
Hero electric Optima review
Okinawa Okhi 90 performance
Okinawa Okhi 90 electric scooter లో 3.8kW బెల్ట్-డ్రైవెన్ సెంటర్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. అలాగే 3.6kWh డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉంటుంది. Okinawa Okhi 90 స్పోర్ట్ మోడ్‌లో 160km, ఎకోలో 200km క్లెయిమ్ చేయబడింది. ఇది వాస్తవమైతే Ola S1 ప్రో .. (115kms ) ను అధిగమించి మార్కెట్ లీడర్‌గా నిలవనుంది. గరిష్ట వేగం.. గంటకు 90 కి.మీ. స్కూటర్. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌తో, CBSతో ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేక్‌లు అమర్చారు.
Okinawa Okhi 90 ధర
FAME II సబ్సిడీలకు ముందు దీని ధర ₹1.22 లక్షలు. Okinawa కొత్త స్కూటర్ బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. Ola S1 Pro, Ather 450X, Bajaj Chetak అలాగే TVS iQubeకి ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ధర కూడా వీటి కంటే చాలా తక్కువగా ఉంది.