MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో 500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. 500 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా బలమైన EV పర్యావరణ వ్యవస్థను సృష్టించే MG ఛార్జ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లినట్లయిందని చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా మెరుగుపరచడం, కేవలం ఛార్జర్‌లు మాత్రమే మరిన్ని వినూత్న కార్యక్రామలు చేపడతామని తెలిపారు.
MG మోటార్ ఇండియా దాని భాగస్వాములైన – Exicom Telesystems, ElectreeFi, EchargerBays, Ionage, Statiq & Highway Delite తదితర సంస్థలు 7.4kW ఛార్జర్‌లను ఇన్ స్టాల్ చేసింది. సగటున రోజుకు ఒక ఇన్‌స్టాలేషన్‌తో సుమారు 50 ప్రధాన నగరాలను కవర్ చేసింది.
పబ్లిక్ మరియు హోమ్ ఛార్జర్‌లతో సహా దేశవ్యాప్తంగా 15,000కి పైగా ఛార్జింగ్ టచ్‌పాయింట్‌లతో బలమైన EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో MG మోటార్ ఇండియా కీలకపాత్ర పోషించింది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సెటప్ చేయడానికి కంపెనీ తన పర్యావరణ వ్యవస్థ భాగస్వాములైన Glida, TPCL, BPCL, Jio-bp, Statiq, Zeon, ChargeZoneతో బ్యాటరీ రీసైక్లింగ్, పునర్వినియో వారంటీ పొడిగింపు కోసం Attero, Lohumతో కలిసి పని చేస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..