New Chetak Electric Scooter | ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఈ చేతక్ ఈవీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్రమంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మరో కొత్త మోడల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.
రోజువారీ రవాణా అవసరాల కోసం స్కూటర్ ప్రాక్టికాలిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. Ather Rizta, Ola S1, మరియు TVS iQube వంటి పోటీ మోడల్‌లు పెద్ద స్టోరేజ్ స్పేస్‌లను కలిగి ఉండి ఫ్యామిలీ స్కూటర్ గా మార్కెట్‌లో క్రేజ్ ను సంపాదించుకున్నాయి. దీంతో బజాజ్ కూడా తన లోపాన్ని సవరిస్తూ చేతక్ లోని నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఎక్కువ బూట్ స్పేస్ తో కూడిన కొత్త మోడల్ ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. స్టోరేజ్ స్పేస్ కోసం బ్యాటరీని కాస్త కిందకు మార్చారు.
ఈ కొత్త కాన్ఫిగరేషన్ లో కొంచెం పెద్ద బ్యాటరీని అమర్చే అవకాశం కనిపిస్తోంది. ఇది స్కూటర్ రేంజ్‌ని పెంచుతుంది. చేతక్ ప్రస్తుత రేంజ్ మోడల్‌పై ఆధారపడి సుమారుగా 123 నుంచి 137 కిలోమీటర్లు ఉంటుంది. కొత్త చేతక్ స్కూటర్ లుక్, డిజైన్ లో ఏ మార్పు ఉండబోదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉన్న డిజైన్ పై ఎంతో మంది కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అప్‌డేట్ చేసిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిసెంబరు మధ్యలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి రూ. 96,000 నుంచి రూ.1.29 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.
మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..