Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

Spread the love

New Hero Vida electric scooter :  దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్..  2022లో తన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం, Hero Vida V1 తోపాటు  Vida V1 Pro   ఇ-స్కూటర్‌లను అందిస్తోంది.  విడా సబ్-బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ లైనప్‌ను విస్తరించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది.

అయితే హీరో మోటో కార్ప్..  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం  పేటెంట్ దాఖలు చేసింది. ఈ పేటెంట్ చిత్రాన్నిచూస్తుంటే ఇది హీరో విడా నుంచి మరింత తక్కువ ఖర్చుతో వస్తున్న స్కూటర్‌గా కనిపిస్తుంది. Vida V1 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఇది  ఫ్యామిలీ ఫ్రెండ్లీ   ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని పేటెంట్ చిత్రం సూచిస్తుంది.

హీరో విడా ఇ-స్కూటర్: డిజైన్

New Hero Vida electric scooter : హీరో తన రాబోయే ఇ-స్కూటర్‌కు విశాలమైన, కొద్దిగా వాలుగా ఉండే సీటు, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, ఫోల్డబుల్ హుక్,  క్లీన్ సైడ్ ప్యానెల్స్‌తో వస్తోంది.  ఫాంట్ ఆప్రాన్ ప్రధాన V-ఆకారపు హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ను కలిగి ఉంది. అయితే LED వింకర్‌లు విస్తరించి ఉన్నాయి. ఇది Vida V1 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మరింత ఫ్యామిలీ బేస్డ్  ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చు. నిశితంగా పరిశీలిస్తే..  వెనుక భాగపు హ్యాండిల్ సింగిల్-పీస్ యూనిట్ కనిపిస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, ఇది డిస్క్ బ్రేక్‌లు లేదా ABS సెన్సార్ రింగ్‌లను కలిగి ఉండవచ్చు.  12-అంగుళాల స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై పరుగులుపెట్టే  అవకాశం ఉంది. అండర్‌పిన్నింగ్‌లలో ముందు భాగంలో ట్విన్-కాయిల్ సస్పెన్షన్,  వెనుక డ్యూయల్-షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. సైడ్ సెక్షన్ పరిమాణాన్ని బట్టి చూస్తే, ఇది భారీ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉండే  అవకాశం ఉంది.

 ఫీచర్లు & ధర అంచనా..

ప్రస్తుత Vida V1 Plus మొత్తం 3.94 kWh సామర్థ్యంతో  110 km రేంజ్ తో  రెండు డిటాచబుల్  బ్యాటరీలను ఉపయోగిస్తుంది. బ్యాటరీ 6kW ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని ఇస్తుంది.  ఇది 25 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.  పేటెంట్ చిత్రాలలో కనిపించే మోటారు V1 ప్లస్‌లో చూసినట్లుగానే కనిపిస్తుంది.

రాబోయే Hero Vida ఇ-స్కూటర్ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైన వాటితో సహా మరిన్ని ప్రాథమికంగా అవసరమైన ఫీచర్లను అందించనుందని భావిస్తున్నారు.  ఇ-స్కూటర్ ధరలను అంచనా వేయడం కాస్త తొోందరపాటే అవుతుంది.  ప్రత్యేకించి FAME II సబ్సిడీ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 1న ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024. అయినప్పటికీ, హీరో ఈ రాబోయే స్కూటర్ ధరను దాదాపు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) లోపు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *