Okaya EV Motofaast 35 : భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రి స్కూటర్ వచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ Okaya EV కంపెనీ కొత్తగా మోటోఫాస్ట్ 35 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అధునాతన స్టైల్, సేఫ్టీ కోరుకునే వారి కోసం దీనిని రూపొందించారు. ఇది భారతదేశలోని అధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో దాని భద్రత ,విశ్వసనీయతకు పేరుగాంచిన అధునాతన LFP బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న డ్యూయల్ బ్యాటరీలను ఇందులో వినియోగించారు.
స్పెసిఫికేషన్స్
Okaya EV Motofaast 35 Specifications : ఒకాయా మోటోఫాస్ట్ 35 స్కూటర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 – 130 కి.మీల రేంజ్ ఇస్తుంది. గంటకు 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ విషయలో కంపెనీ ప్రత్యేకమైన డిజైన్ & ఫీచర్లు కఠినమైన భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించింది.
ఈ స్కూటర్ లోని మోటార్ 2300W పీక్ పవర్ అవుట్‌పుట్‌ను అందించగలదు. ఇందులో అధునాతన LFP బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న 3.53 kWh సామర్థ్యంతో డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీ అసాధారణమైన భద్రతకు, ముఖ్యంగా భారతదేశంలోని అధిక-ఉష్ణోగ్రత వాతావరణంలో మన్నికగా ఉంటుంది. MotoFaast 35లో అదనపు సేఫ్టీ ఫీచర్ అయిన బజర్ ఆప్షన్ ను ఇచ్చింది. ఇది థర్మల్ రన్‌అవే విషయంలో కనీసం 5 నిమిషాల ముందు రైడర్‌కు అలారమ్ ను మోగిస్తుంది. స్కూటర్ బ్యాటరీ మోటారు రెండింటిపై 3 సంవత్సరాల వరకు వారంటీని ఇస్తోంది.
ఇక బ్రేకింగ్ సిస్టం విషయానికొస్తే.. Okaya Motofaast 35 లో 12-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2 GHz ప్రాసెసర్, 3 GB RAMతో పనిచేస్తుంది.
Okaya EV Motofaast 35 ధర
Okaya EV Motofaast Price : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,41,999 (ఎక్స్-షోరూమ్) లకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఆరు రంగులలో లభిస్తుంది: మెటాలిక్ సియాన్, మెటాలిక్ రెడ్, మెటాలిక్ వైట్, మెటాలిక్ సిల్వర్, మ్యాట్ గ్రీన్ మెటాలిక్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..