Home » PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Yojana
Spread the love

PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు.

ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్ విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం సూర్యఘర్ యోజన ను ప్రకటించింది. ఈ పథకంలో సోలార్ ప్యానెళ్లు బిగించుకునేవారికి భారీగా సబ్సిడీలను ప్రకటించింది. దాంతోపాటు బ్యాంకు రుణాలను కూడా అందిస్తోంది. ఈ పథకం 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థకు రూ.78,000 వరకు సబ్సిడీని అందిస్తోంది.

జాతీయ పోర్టల్ pmsuryaghar.gov.in ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సంబంధిత రంగంలో మనకు నచ్చిన ప్రముఖ కంపెనీలను సంప్రదించవచ్చు. ఇండ్లపై ఇన్‌స్టాలేషన్ కోసం 7 శాతం వడ్డీ రహిత రుణాలను కూడా పొందవచ్చు. పథకం గురించి పూర్తిగా వివరించడానికి ప్రతీ జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్‌ను అభివృద్ధి చే యనున్నారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్సన్టీవ్ రాయితీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు కేంద్రం ప్రజలపై ఎలాంటి ఖర్చుల భారం లేకుండా చూస్తుందని కేంద్రం ప్రకటించింది.

పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్చచ్ఛంద సంస్థలు ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని మోదీ కోరారు. 2030 నాటికి సౌరశక్తి ద్వారా 500 గిగా వాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఇంధన వ్యయం తగ్గించడంతోపాటు ప్రజలపై విద్యుత్ భారం తగ్గిపోతుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) సీనియర్ ప్రోగ్రామ్ లీడ్ నీరజ్ కుల్దీప్ తెలిపారు.

ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకోండిలా..

  • PM Surya Ghar Yojana బిజిలీ పథకం లింక్ క్లిక్ చేయండి
  • రూఫ్‌టాప్ సోలార్ కోసం Apply  అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, కుటుంబ సభ్యుల సంఖ్య, మొబైల్ ఫోన్ నంబర్, ఈ – మెయిల్ వివరాలు పొందుపరచాలి.
  • తర్వాత  దశకు వెళ్లేందుకు  మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
  • ఈ దశ పూర్తయిన  తర్వాత  పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు ఏ దశలోనైనా బ్యాంక్ వివరాలను సమర్పించవచ్చు.
  • సోలార్ ప్యానళ్లు ఇన్‌స్టాల్ చేసే నిపుణులను సంప్రదించాలి.
  • సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తరువాత , ప్లాంట్ పూర్తి వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తరువాత  డిస్కం తనిఖీ చేసిన తర్వాత పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికెట్  రూపొందుతుంది.
  • కమీషనింగ్ నివేదిక వచ్చిన తర్వాత పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, రద్దయిన చెక్కును  సమర్పించాలి.  ఈ దశలన్నీ పూర్తయిన  30 రోజుల్లోగా బ్యాంక్ ఖాతాలో మీరు సబ్సిడీని అందుకుంటారు.

మీకు తెలుసా?

  • పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
  • MNRE సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (CFA) పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లకు సబ్సిడీ అందిస్తుంది.
  • ఆన్-గ్రిడ్,  ఆఫ్-గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లకు సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.
  • పథకం కింద ఏర్పాటు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ సిస్టం  గరిష్ట సామర్థ్యం 10 kW.
  • పథకం యొక్క లబ్ధిదారులు డిస్కమ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA)పై సంతకం చేయాలి.
  • సోలార్ ప్యానెల్ సిస్టం 25 ఏళ్ల పాటు ఉంటుంది.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *