Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy
Spread the love

Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస్తోంద‌ని వివరించారు. మోదీ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగ‌మిస్తూ ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. స్థానికంగా పునరుత్పాక ఇంధన తయారీని ప్రోత్సహించేందుకు జర్మనీ, డెన్మార్క్‌లు మనతో చేతులు కలపడం శుభ‌ప‌రిణామ‌మ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా అస్సాం నుంచి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధనాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. కాగా పునరుత్పాదక ఇంధన సదస్సు స‌క్సెస్ అయింద‌ని, ఈ రంగంలోకి రానున్న కొద్ది సంవత్సరాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని, పెద్దసంఖ్యలో యువ‌త‌కు ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయ‌ని మంత్రి ప్ర‌హ్లాద్ పేర్కొన్నారు. భార‌త్‌ భవిష్యత్తు మొత్తం పునరుత్పాదక ఇంధన రంగానిదేనని వెల్లడించారు.

RE-ఇన్వెస్ట్ 2024 కాన్‌క్లేవ్‌లో రాష్ట్రాలు పాల్గొని ఈ దశాబ్దం చివరి నాటికి 540GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాల‌ని ప్రతిజ్ఞ చేశాయి. దశాబ్దం ముగిసే సమయానికి గుజరాత్ అత్యధికంగా 128 .6 GW ఉత్ప‌త్తి, ఆ తర్వాత 72.6 GWతో ఆంధ్రప్రదేశ్ (AP) పునరుత్పాదక ఇంధన ఉత్ప‌త్తిని ల‌క్ష్యం పెట్టుకున్నాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *